
తెలంగాణ వార్త::: ఓ మహిళ మొబైల్ చార్జర్‌కు అమర్చిన రహస్య కెమెరాను కనుక్కొంది. అది అక్కడ ఉన్న విద్యార్థినులకు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మునిసిపాలిటీలోని మైత్రి విల్లాస్‌లో బండారు పరమేశ్వర్ అనే వ్యక్తి మహిళా హాస్టల్‌ను నడుపుతున్నాడు. ఎవరికీ తెలియకుండా అతడు హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలను అమర్చాడు. వంటగదితో పాటు.. మరికొన్ని చోట్ల ఈ కెమెరాలను పెట్టాడు. ఎట్టకేలకు విద్యార్థినులు అనేక చోట్ల దాచిన కెమెరాలను కనుగొని పోలీసులను సంప్రదించారు. సమాచారం మేరకు అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ నుండి అనేక గాడ్జెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఛార్జర్ కెమెరాలో అమర్చిన చిప్‌లను పోలీసులు కనుగొన్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు.. ఇంకా ఏమైనా కెమెరాలను అమర్చాడా అని పోలీసులు తనిఖీ నిర్వహించారు. హాస్టల్ , బాత్రూంలను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Leave a comment