ఆర్మూర్, తెలంగాణ వార్త:నిజామాబాద్ జిల్లా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్ నాగరాజు (ఐపీఎస్) అధికారి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఏసిపి ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయియత్ నగర్ కాలనీలో సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల మధ్యలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్లు, పదిమంది ఎస్ఐలు,100 మంది పోలీస్ సిబ్బంది,22 మంది స్పెషల్ పార్టీ, 25 మంది మహిళ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇందులో భాగంగా తనిఖీ నిర్వహించగా 79 వాహనాలు అందులో 2 కార్లు 5 ఆటోలు 72 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరచుకోన్నట్లు తెలిపారు. వాహనాలకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులకు చూయించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి ఆర్మూరు ఏసిపి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను ఉంటే అధికారులు అడిగిన వెంటనే చూపించాలని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వారి విధులు నిర్వహించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని తెలిపారు.తప్పనిసరిగా ఎలిమెంట్ ధరించాలి, వాహన పత్రాలు దగ్గర ఉంచుకోవాలి ఇలా పదేపదే అధికారులు చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే చట్టరీత్య చర్యలు తప్పు అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఆర్మూర్ డివిజన్ ఇన్స్పెక్టర్లు.. ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు,ఆర్మూర్ రూరల్ సి.ఐ, ఎస్సై లు శ్రీకాంత్, ప్రదీప్ సంబంధింత అధికారులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, స్థానిక కౌన్సిలర్ ఇంతియాజ్, పలువురు కాలనీ సామాజిక సేవకులు ప్రజా సమస్యలకు స్పందించే యువకుడు తబ్బు వారి బృందం మరియు ప్రజా ప్రతినిధులు వాహనదారుల బాధితులు పాల్గొన్నారు.
Leave a comment