
తెలంగాణ వార్త:: హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలెర్ట్. మహిళా దినోత్సవం రోజునే నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్టు అధికారులు ప్రకటించారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా ఫ్లై ఓవర్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం.. ఆ ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేలా ఎన్‌హెచ్ఏఐ విజ్ఞప్తి మేరకు అక్కడున్న జలమండలి పీఎస్సీ పైప్ లైన్‌ను వేరే చోటుకి మార్చే పనులు చేపట్టనుంది
బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ దగ్గర ఉన్న 1500 ఎంఎం డయా పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు మార్చి 8వ తేదీన అంటే శనివారం రోజు ఉదయం 6 గంటల నుంచి అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి. దీంతో ఈ 12 గంటల పాటు బీహెచ్ఈఎల్ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాలో పూర్తిగా ఆపేయగా.. మరికొన్ని చోట్ల లో- ప్రెజర్‌తో నీటి సరఫరా జరగనుంది.
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పాడే ప్రాంతాలు
ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తి శ్రీ నగర్, బీరంగూడా, అమీన్ పూర్, నిజాంపేట్.. ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు జాగ్రత్త పడాలని అధికారులు కోరుతున్నారు. శనివారం రోజున నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాం.
Leave a comment