Home హాట్ న్యూస్ బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్ వీరేంద్ర
హాట్ న్యూస్

బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్ వీరేంద్ర

బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్
తణుకు:
బైంసా, తెలంగాణ వార్త: తణుకు గ్రామంలోని విద్యార్థిని చెరువులో లో దూకి ఆత్మహత్య యత్నంకు ప్రయత్నించిన 16 ఏళ్ల బాలికను అత్యంత చాకచక్యంగా ప్రాణాలకు తెగించి ఒక జర్నలిస్ట్(నిడదవోలు,మహా టీవీ రిపోర్టర్ వీరేంద్ర) కాపాడిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి తణుకు పట్టణంలో చోటుచేసుకుంది.
తణుకు పట్టణ ఎస్.ఐ కె.గంగాధర్ అందించిన వివరాలు ప్రకారం తణుకు పాతురు కు చెందిన 16 ఏళ్ల బాలిక ఆదివారం రాత్రి ఎగ్జిబిషన్ కు వెళ్లి స్నేహితులతో మాట్లాడుతుండగా, అబ్బాయిలతో మాటలు ఏంటని తల్లి మందలించడంతో మనస్తాపం చెంది తణుకు అత్తిలి కాలువలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వీరేంద్ర బాలిక దూకడం గమనించి వెంటనే కాలువలోకి దూకి బాలికను రక్షించాడు. తణుకు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులుకు అప్పగించినట్లు ఎస్.ఐ గంగాధర్ తెలిపారు. ప్రాణాలకు తెగించి బాలికను రక్షించిన మహా టీవీ రిపోర్టర్ వీరేంద్ర ను తణుకు ఎస్ఐ గంగాధర్ అభినందించారు.

మాధవ్ జర్నలిస్ట్ భైంసా

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page