Home హాట్ న్యూస్ జర్నలిస్టులు పడుతున్న సమస్యలపై అసెంబ్లీలో గర్జించిన సీతక్క.
హాట్ న్యూస్

జర్నలిస్టులు పడుతున్న సమస్యలపై అసెంబ్లీలో గర్జించిన సీతక్క.

జర్నలిస్ట్ పడుతున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన సీతక్క కు తెలంగాణ వార్త తరుపున ధన్యవాదాలు.

జర్నలిస్టుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడలేని ప్రజాప్రతినిధులు జర సిగ్గు పడండి

మీ ప్రచారానికి మీ పొగడ్తలకు జర్నలిస్టులు కావాలి, కానీ వాళ్ల సమస్యలు మీకు అవసరం లేదు

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో నాశనమైన జర్నలిస్టుల బతుకులు

అందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన టిఆర్ఎస్ ప్రభుత్వం

జర్నలిస్టుల సమస్యలను ప్రశ్నించలేని ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను ఏం ప్రశ్నిస్తాయి

హైదరాబాద్: తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సీతక్క కు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నంచిన్ని వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జర్నలిస్టుల బతుకులు పూర్తిగా నాశనం చేశారని వారికి కావాల్సిన హక్కులు ఎక్కడ ఇవ్వడం లేదన్నారు. వాస్తవాలు రాసే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు వేరే వృత్తులలో తమ జీవితాన్ని కొనసాగించడంతో అనేక అవినీతి అక్రమాలు బయటకు రావడం లేదన్నారు. టిఆర్ఎస్ పార్టీ అంటేనే అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమైందన్నారు. అధికారులు లంచాలు ఇస్తే తప్ప విధులు నిర్వహించడం లేదని దీనిపై ఎన్ని కథనాలు రాసిన సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయంకు, కేటీఆర్ కు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన బహిరంగంగా ట్విట్టర్ చేసిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా భూకబ్జాలు అవినీతి అక్రమాలే కనిపిస్తున్నాయని వీటిని వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం వల్ల అవినీతి అక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న సంకేతాలు ప్రజలలో వెళ్తున్నాయన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఏవైనా ఎన్నికలు వస్తేనే జర్నలిస్టు గుర్తుకు వస్తారని లేకుంటే వాళ్లని జైలుకు పంపించడం గుర్తుకు వస్తుందని అందుకోసమే తెలంగాణలో జర్నలిస్టులకు ఇప్పటి వరకు అక్రిడేషన్ కార్డులు కూడా జారీ చేయలేదని హెల్త్ కార్డుల మాట మాట్లాడుకోవడం సిగ్గుచేటన్నారు. చిన్న పత్రికలను పూర్తిగా నాశనం చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికె చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల నుండి అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారని గతంలో ఇచ్చిన అక్రిడేషన్ కార్డు లో భారీగా అవినీతి జరిగిందని ఒక్కొక్క కార్డులు 30 నుండి 50 వేల వరకు పత్రికా యాజమాన్యాలు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టుల కోసమా.? లేక యజమాన్యం అమ్ముకోవడం కోసమా.? తెలపాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశ పెట్టడం తప్ప దానిని ఇచ్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి ఏమాత్రం లేదని తెలంగాణలో ఉన్న అందరి జర్నలిస్టులకు తెలుసు కాబట్టి ఈ విషయంపై మాట్లాడడం వృధా అన్నారు. ఇప్పటికైన తెలంగాణ జర్నలిస్టులు ఆలోచించి జర్నలిస్టులకు న్యాయం చేసే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page