జర్నలిస్ట్ గాంధికి టియుడబ్ల్యుజె ఘన నివాళీ
ఖమ్మం, తెలంగాణ వార్త : సీనియర్ జర్నలిస్ట్ , న్యాయవాది బైరు కరం చంద్ గాంధి సేవలు శ్లాఘనీయమని టి యుడబ్యుజె ( ఐ. జె యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాం నారాయణ అన్నారు. ఇటివల అనారోగ్యంతో మ్రతి చెందిన గాంధి సంస్మరణ సభ సోమవారం ఉదయం స్ధానిక ప్రెస్ క్లబ్ లో టియు డబ్ల్యు జె ఐ జె యు ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడ్తూ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గాంధీజీ అనేక పత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం ఎంతో క్రషి చేశాడని ఆయన కోనియాడారు. దశబ్ధాలుగా ఖమ్మం లో ఉంటూ అధికారులతో ప్రజాప్రతినిధులతో సత్ సంబంధాలను నెరుపుతూ ఎన్నో క్లిష్టమైన సమస్యలను సైతం సులభంగా చేధించారని ఆయన అన్నారు.పేద కుటుంబం నుంచి వచ్చిన గాంధి పట్టుదలతో లా చదవి అనతి కాలంలోనే న్యాయవాది రంగంలో రాణించారని అన్నారు.ఎల్లప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ తన దైన ముద్ర వేసుకున్న గాంధీ జర్నలిస్ట్ యూనియన్ కు చేసిన సేవలు కూడా అమోఘమన్నారు .ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికి అకాల మ్రతి జర్నస్టులను కలచి వేసిందని ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్బ్రంతిని వ్యక్తం చేస్తూ కుటుంభ సభ్యులకు ప్రగడా సంతాపం ప్రకటించారు. గాంధి కుటుంబానికి తమ ఎలవేళ్ళలా తమ యూనియన్ అండగా ఉంటుందని ఈ సందర్బంగా ఆయన ప్రకటించారు.
టి యు డబ్ల్యు జె (ఐ జె యు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జ్ నలజాల వెంకట్రావ్,న్యాయవాది పిట్టల రాంబాబు, టియుడబ్ల్యుజె జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు, కోశాధికారి జనతా శివ ,ఎలక్ర్టానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాటేటి వేణుగోపాల్,టియుడబ్ల్యుజె ఐజెయు నగర కమిటి అధ్యక్షులు మైసాపారావు,కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు మైనోద్దిన్, వై మాధవరావు,జనార్దనాచారి, నగర కమిటి నాయకులు జి రాంబాబు,రాయల బసవేశ్వర్ రావు, ఏలూరు వేణుగోపాల్,మురళీక్రష్ణా రెడ్డి,టియుడబ్యజె(మీడియా అకాడమి)నాయకులు కె వెంకటేశ్వర్లు,నామ పురుషోత్తం,వంశీ,శ్రీనివాస్,లింగయ్య,నగేశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా గాంధిజీ చిత్ర పటానికి పలువురు జర్నలిస్టులు,న్యాయవాదులు పూలమాల వేసి నివాళులు అర్పించి ఒక నిమిషం మౌనం పాటించారు .
Leave a comment