ఆర్మూర్, తెలంగాణ వార్త :: భారతి జనతాపార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 109 జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ తొలిదశ, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో నే కాదు దేశ స్వాతంత్రం కోసం, తెలంగాణలో రాక్షసుల్ల ప్రవర్తించిన మతోన్మాదులైనటువంటి రజాకాలను సైతం ఎదిరించి నిలిచిన ఓ సాహసి తెలంగాణ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసినటువంటి ఒక మహానీయుడు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఇందిరాగాంధీ తనయుడు అప్పటి కేంద్ర మంత్రి సంజీవ్ గాంధీ పార్లమెంట్లో బీసీ మండల కమిషన్ సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడడంతో నిరసిస్తూ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన నిరసన తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో బీసీల ఐక్యత కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం తాన శక్తి కి మించి కృషి చేయడాన్ని ప్రతి తెలంగాణ యువకుడు తనను ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ బాపూజీ ఏ విధంగానైతే స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులతో, తెలంగాణ లో మత రక్కసూలైన రజాకారులతొ మరియు ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెసు ప్రభుత్వంతో పోరాటం చేశాడో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఛేస్తున్న అవినీతి, అక్రమాలపై,అసత్యపు ప్రచారాలపై ఉద్యమించి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అధిక సంఖ్యలో ఎన్నుకొని ఓటుతో సమాధానమివ్వాలని అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పద్మశాలి సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్,ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి మిర్యాల్ కర్ కిరణ్ కుమార్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ కార్యదర్శి రెడ్డబోయిన దక్షిణమూర్తి మరియు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment