నందిపేట్. తెలంగాణ వార్త::
నందిపేట్ మండలంలోని సిద్ధపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జామున కృష్ణ జింక గుండె నొప్పితో మృతి చెందినట్లు నందిపేట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరిహక ప్రాంతంలో నీరు నిలిచి వన్యప్రాణుల కొరకు గాసం లేకుండా అయిపోయింది ఆహార కొరత ఏర్పడడంతో ఆహారం కొరకు వన్యప్రాణులు కొత్త ప్రదేశాలు వెతుకుతున్నాయి , వేట తోడేళ్లు జింకను హతమార్చడానికి వెంట పడడంతో తోడేలు భారీ నుండి తప్పించుకోవడం కొరకు అతివేగంగా పరిగెత్తి తోడేలు భారీ నుంచి రక్షించుకుంది కాని పరిగెత్తడంతో ఆయాసం వలన గుండెపోటుతో జింక చనిపోయిందని పశు వైద్యాధికారి డాక్టర్ హనుమంత్ రెడ్డి పోస్ట్ మార్టం చేసి నివేదిక ఇచ్చారని వివరించారు.
Leave a comment