నందిపేట్, తెలంగాణ వార్త:: నందిపేట్ మండలంలో నిర్మాణం జరుగుతున్న నందిపేట్ మండల మున్నూరు కాపు సంఘ ఫంక్షన్ హాల్‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు పర్యవేక్షించడం జరిగింది.వెంటనే నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఈ మండపంలో జరిగే మొదటి పేదింటి మున్నూరు కాపు ఆడబిడ్డ పెళ్లికి అన్ని పెళ్లి ఖర్చులు తానే భరించి పెళ్లి చేస్తానని మరో కోటి రూపాయల నిధులతో మున్నూరు కాపు సంఘ భవనానికి కావలసిన భోజనశాల వాటర్ ట్యాంకు ఎలక్ట్రిసిటీ సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్,మండల మున్నూరుకాపు నాయకులు సిలిండర్ లింగం, చెక్ చెక్ ముత్యం, మంద మహిపాల్, మంద మొగులాజి,కుద్వాన్పూర్ నరసయ్య , టిఆర్ఎస్ నాయకులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Leave a comment