Home హాట్ న్యూస్ బుగ్గారం మీ-సేవ సెంటర్ పై చర్యలు తీసుకోండి.. దౌర్జన్యంగా భూ కబ్జా చేసిన మీ—సేవ నిర్వాహకుడు..
హాట్ న్యూస్

బుగ్గారం మీ-సేవ సెంటర్ పై చర్యలు తీసుకోండి.. దౌర్జన్యంగా భూ కబ్జా చేసిన మీ—సేవ నిర్వాహకుడు..

జిల్లా కలెక్టర్ కు బాధిత రైతు పిర్యాదు

ఎలాంటి ఆధారాలు లేకుండానే 31గుంటలు భూమి మార్పిడి

తల్లిపేరున భూమి మార్చుకున్న మీ సేవ నిర్వాహకుడు

రెవెన్యూ అధికారులనూ తప్పుద్రోవ పట్టించిన మీ-సేవ “కుడు”

తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానని రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా వాంగ్మూలం

నెలలు గడిచినా పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయని వైనం

అక్రమంగా రైతుబంధు స్వాహా…..

దౌర్జన్యంగా భూ – కబ్జా…. చేసిన
మీ – సేవ నిర్వహకుడు

పోలీసులకూ పిర్యాదు చేసిన బాధిత రైతు

పిర్యాదులు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు

మీ- సేవ నిర్వాహకులను కాపాడే ప్రయత్నంలో అధికారులు…?

సర్వే చేయించినా హద్దులు పాతని అధికారులు

స.హ. చట్టాన్ని కూడా తుంగలో త్రొక్కిన మండల తహసీల్దార్ కార్యాలయం

మీ సేవ దుర్వినియోగంపై చర్యలు శూన్యం

బుగ్గారం/జగిత్యాల జిల్లా: తెలంగాణ వార్త

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మీసేవ సెంటర్ యొక్క సేవలను దుర్వినియోగం చేసి భూమి మార్పిడి చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని మీ సేవ సెంటర్ పై, నిర్వహకునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కళ్లెం చిన్నన్న సోమవారం జిల్లా కలెక్టర్ గుగులోతు రవి కి ప్రజావాణిలో పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ…. బుగ్గారం మండలం సిరివంచకోట శివారులోని సర్వే నంబర్ 330లో గల తన పట్టాభూమి 31గుంటలను బుగ్గారం మీ-సేవ సెంటర్ నిర్వాహకుడు మొగిలి సుధన్
ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయన తల్లి పేరున మార్పిడి చేసుకున్నాడని ఆరోపించారు.
మీసేవ తన చేతిలో ఉందని భమిసి
రెవెన్యూ అధికారులనూ కూడా “మీ-సేవ నిర్వహకుడు” తప్పుద్రోవ పట్టించాడని అన్నారు.
గతంలోనే స్థానిక మండల తహసీల్దార్ తో పాటు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయగా తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానని రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాడని కళ్లెం చిన్నన్న సూచించారు.
31 గుంటల భూమికి కేవలం 15 గుంటలు మాత్రమే తిరిగి రిజిస్ట్రేషన్ చేశాడని, భూమి సర్వే చేయించి మిగతాది చేస్తానని చెప్పి మరోసారి మోసం చేశాడని అన్నారు. సర్వేయర్ ద్వారా సర్వే చేయించి నెలలు గడిచినా మిగతా 16గుంటలు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు రావాల్సిన రైతుబంధును కూడా అక్రమ భూ మార్పిడి తో మీసేవ నిర్వాహకుడు
స్వాహా….. చేసి తన తల్లిపేరున పొందుతున్నారని పేర్కొన్నారు.

అక్రమంగా భూ మార్పిడి చేసుకొని
దౌర్జన్యంగా భూ – కబ్జా…. చేస్తున్నారని ఆరోపించారు.
బాధిత రైతు కళ్లెం చిన్నన్న
పోలీసులకూ కూడా పిర్యాదు చేసినట్లు తెలిపారు.
స్థానిక మండల రెవెన్యూ అధికారులు అయితే పిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, మీ- సేవ నిర్వాహకులను కాపాడే ప్రయత్నంలో అధికారులు ఉన్నారని ఆరోపించారు.
స్వయంగా తానే ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి మండల సర్వేయర్ ద్వారా భూమి సర్వే చేయించినా అధికారులు హద్దులు పాతలేదని అన్నారు.
నా పట్టా భూమిని మీసేవ నిర్వాహకుడు మొగిలి సుధన్ తల్లి అయిన మొగిలి రాజవ్వ పేరున ఎలా మార్పిడి జరిగిందో తెలపాలని స.హ. చట్టం ద్వారా రెవెన్యూశాఖ అధికారులను కోరితే దాన్ని కూడా తుంగలో త్రొక్కి సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించారని, ఏండ్లు గడిచినా తనకు సమాచారం ఇవ్వడం లేదని బాధిత రైతు కళ్లెం చిన్నన్న ఆవేదన వ్యక్తపరిచారు.

మీ సేవ యొక్క సేవలను తన స్వార్థం కోసం దుర్వినియోగం చేసి నాభూమి రికార్డుల్లో గల్లంతు చేశారని మీసేవ సెంటర్ పై లిఖితపూర్వకంగా పిర్యాదు చేసినా రెవెన్యూశాఖ నుండి చర్యలు శూన్యం అయ్యాయని బాధిత రైతు కంఠతడి పెట్టారు.
మొగిలి సుధన్ చేతిలో ఉన్న మీ సేవ యొక్క సేవల ద్వారా రెవెన్యూశాఖ రికార్డులలో అన్యాయంగా, అక్రమంగా, దర్జాగా భూమిని మార్చుకోవడమే కాకుండా మొఖాపై ఉన్న తన భూమిని కూడా దౌర్జన్యం గా కబ్జా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన భూమి తనకు 31గుంటలు రెవెన్యూశాఖ రికార్డుల్లో మార్చాలని, నా భూమి నాకు దక్కే విధంగా చూడాలని, నాకు చెందాల్సిన రైతుబందు డబ్బులు రూ.34,875-00 మొగిలి రాజవ్వ నుండి నాకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ను బాధిత రైతు కళ్లెం చిన్నన్న కోరారు.

తన, తన కుటుంబ స్వార్థం కోసం మీసేవ యొక్క సేవలను దుర్వినియోగం చేసినందుకు గాను మీసేవ నిర్వహకునిపై, సెంటర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని మీసేవను సీజ్ చేయాలని కళ్లెం చిన్నన్న జిల్లా కలెక్టర్ గుగులోతు రవికి విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page