ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని పిస్స మల్లన గుడి వద్ద గురువారం టెక్నో సాప్ట్ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ మరియు స్టాఫ్ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు బతుకమ్మ ను రంగు రంగుల పూలతో అలంకరించి త్రికోన రూపంలో అమర్చి చప్పట్లు చరుస్తూ వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ స్టూడెంట్స్ ఎంతో ఆనందోత్సాహాలతో నృత్యాలు చేయడం జరిగిందనీ అనంతరం బతుకమ్మని చెరువులో నిమజనం చేయడం జరిగిందని ఇన్స్టిట్యూట్ కరెస్పాండెట్ జితేందర్ రెడ్డి తిలిపారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి గా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టర్ అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపి బతుకమ్మ పండగ సుమారు 1000 వెయ్యి సంవత్సరముు ల చరిత్ర కలిగిన పండగ అని ఇట్టి పండగను అక్టోబర్ మాసంలో అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు 9 రోజులు అత్యంత వైబవంగ మహిళలు జరుపుకొనే పండగ అని ఇట్టి పండగ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత రాష్ట్ర పండగ గా యావత్తు తెలంగాణ మహిళలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు కు ప్రతీకగా జరుపుకుంటున్నారని నివేదన్ కొనియాడారు ఇట్టి కార్యక్రమంలో టీచర్స్ ఈశ్వరి,సాయి, నవీన్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Leave a comment