హైదరాబాద్( తెలంగాణ వార్త)తెలంగాణలో మద్యం ధరలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరలు తగ్గిస్తే సామాన్యులు కూడా టీకి బదులు మద్యం తాగుతారని అన్నారు. అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ పద్దులు, ఆదాయంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చా రూ అందులో భాగంగా.. అధిక ధరలు పెట్టడం కూడా మద్య నిషేధంలో భాగమేనని పేర్కొన్నారు. ధరలెక్కువగా ఉంటే మద్యం సేవించకుండా ఇంటి అవసరాలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. మద్యం ద్వారా ఆదాయం పెంచుకునే ఉద్దేశం లేదని ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు.
ఇక, మద్య నిషేధం గురించి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమలు చేస్తే తెలంగాణలో నిషేధించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. మన రాష్ట్రంలో నిషేధించి పక్క రాష్ట్రంలో విక్రయాలు జరుపుతుంటే పెద్ద మాఫియా తయారవుతుందని, కల్తీ మద్యం పెరిగిపోతుందని వివరించారు. అలాగే, రైతుల మాదిరి గీత కార్మికులకు కూడా బీమా సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్టు తెలిపారు. తాటి, ఈత చెట్లు ఎక్కేందుకు ఆధునిక యంత్రాలను గీత కార్మికులకు సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు.
Leave a comment