మాక్లూర్,
తెలంగాణ వార్త :మాక్లూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్ కథనం మేరకు దీపక్ (30) కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు పంపించి తలుపులు పెట్టుకున్నాడు. చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మాధవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Leave a comment