Home హాట్ న్యూస్ నందిపేట్ లో భారీ తిరంగా ర్యాలీ.
హాట్ న్యూస్

నందిపేట్ లో భారీ తిరంగా ర్యాలీ.

మండల ముస్లిం కమిటీ నిర్వహణ

భారీ సంఖ్యలో హాజరైన ముస్లింలు

నందిపేట్, తెలంగాణ వార్త:
మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం జుమా నమాజ్ అనంతరం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హర్ ఘర్ తిరంగా భారీ నిర్వహించారు, పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం ప్రజలు త్రివర్ణ పథకాన్ని చేతబూని “సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’ ‘జై జవాన్ జై కిసాన్” అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ ప్రధాన మెయిన్ రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించారు. జామ మస్జిద్ నుండి ప్రారంభమైన ర్యాలీలో జామ మస్జిద్ , ఇబ్రహీం మజీద్, రహమామియా మజీద్ మరియు మస్జిద్ మోజ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నరు. జామా మసీదు నుండి జిల్లా పరిషత్ హైస్కూల్, బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఐలమ్మ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిం చి జనగణ గేయం పాడి ర్యాలీ విరమించారు.
ఈ సందర్బంగా తాసిల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతు 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ అంతట జరుగుతున్న వేడుకలలో భాగంగా శుక్రవారం నందిపేట్ మండల ముస్లింలు భార ర్యాలీ తీయడం మండల ప్రజలకు గర్వకారణమని ప్రశంసించారు.
ఎస్సై ఆరిపోద్దిని మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జరుపుకునే స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ముస్లిం ప్రజలు కూడా తమవంతు సహకారం అందించి దేశ ప్రతిష్టాను పెంపొందిస్తున్నారని కొనియాడారు
75 వ స్వతంత్ర దినోత్సవన్నీ పురస్కరించుకొని ప్రజలలో అవగాహన కల్పించడానికి తిరంగా ర్యాలీ నిర్వహించామని మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు కలిమ్ అహ్మద్ పేర్కొన్నారు , కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండే దేశభక్తిని పెంపొందించాలని కోరారు. దేశం కోసం స్వతంత్ర పోరాటంలో ముస్లింలు పాల్గొని ప్రాణాలు అర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా దేశం కొరకు అవసరమైతే తమ ప్రాణాలు అర్పించడానికి ముస్లింలు సిద్ధంగా ఉన్నారన్నారు. .
సర్పంచ్ ఎస్.జి వాణి తిరుపతి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం గా ఉంటూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవిస్తూ ప్రపంచ దేశాలకు భారతదేశ ఆదర్శంగా ఉందన్నారు.

ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ భరత్, మండల ముస్లిం కమిటీ ఫౌండర్ షేక్ గౌస్, రఫీ, మండల టిఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పాషా మస్జిద్ కమిటీ అధ్యక్షులు గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు ,
నందిపేట్ గ్రామ ముస్లింలు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page