నందిపేట్, తెలంగాణ వార్త: నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజాంబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ అన్న గారి సూచన మేరకు నందిపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులతో రాఖీ పండగ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వివరిస్తూ రాఖి పండగ ముఖ్య ఉద్దేశ్యమైన అన్న చెల్లెల ప్రేమ బాంధవ్యాలను, చెల్లెలి పట్ల అన్న యొక్క రక్షణ విధిని నిర్వర్తిస్తూ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనందరం తెలంగాణకు రక్ష ఈ దేశానికి రక్ష అనే నినాదంతో పని చేస్తూ ఈ దేశం యొక్క రక్షణ పట్ల, అభివృద్ధి పట్ల అందరం నిబద్ధత పని చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాచర్ల సాగర్, మండల ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, జెడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం, నందిపేట్ పట్టణ ఉపసర్పంచ్ భరత్, నందిపేట్ మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ప్రశాంత్, మండల గోసంగి సంఘం అధ్యక్షుడు శేఖర్, నందిపేట్ పట్టణ యూత్ అధ్యక్షుడు దినేష్, నందిపేట్ మండల యూత్ కార్యదర్శి దీపక్, నందిపేట్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు గంధంసాయిలు, తల్వేద నాని, యూత్ నాయకులు లక్ష్మణ్, అభి శ్రీనాథ్, పవన్ కళ్యాణ్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతులు పాల్గొన్నారు.
Leave a comment