హైదరాబాద్, తెలంగాణ వార్త :శుక్రవారం చర్లపల్లి శ్రీకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ను ఉప్పల్ నియోజకవర్గ టి యు డబ్ల్యూ జే సెక్రెటరీ గార్లపాటి శ్రీనివాసరావు ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్ల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకుని ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత తమదేనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బేతి సుభాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్లో ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టి యు డబ్ల్యూ జే కి చెందిన పాత్రికేయులు సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
Leave a comment