శుక్రవారం రోజు శ్రీ భాషిత పాఠశాల ఆర్మూర్ లో ప్రఖ్యాత రోబోటిక్ ల్ల్యాబ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆర్మూర్ ఎమ్మెల్యే మరియు యు.జి.సి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సిరఫ్ శిలా ఫలకం ఆవిష్కరణ చేసి రోబోటిక్స్ ల్యాబ్ నీ ప్రారంభించారు. ప్రయోగశాలలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలను చూసి వారు వివరించిన విధానం చూసి ఎమ్మెల్యే అభినందించారు విద్యార్థులకు పాఠశాల దశ నుండి ఇ రోబోటిక్ ప్రయోగశాలను అందించిన శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యం అభినందించారు. ప్రయోగశాల లో ఉన్న మానవ ఆకృతి గల రోబో జీవన్ రెడ్డి మరియు విద్యార్థులు ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది విద్యార్థి దశ నుంచి చదువుతోప ప్రయోగాత్మకంగా అభ్యసించే వీలుగా ఇలాంటి ఇ ప్రయోగశాలలు ఉండాలని టుడే ప్రాథమిక విద్యకు ఒక సార్ధకత లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం చదువుల పట్ల విద్యార్థుల పట్ల అనేకమైన అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ విద్యార్థులు దేశ విదేశాల్లో మన్ననలను పొందుతున్నారని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో ఆన్లైన్ క్లాస్ రూమ్ ని టిఆర్ఎస్ అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ,పవన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుందర్ మాట్లాడుతూ విద్యార్థి ప్రాథమిక దశ నుంచే ఎన్నో గొప్ప కార్యక్రమాలకు అంకురార్పణం జరుగుతుందని వాటికి ఇటువంటి ప్రయోగశాలలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇలాంటి ఉన్నతమైన ప్రయోగశాల ఆర్మూర్ డివిజన్ లోని ఒకే ఒక్క ప్రైవేటు పాఠశాలలో ఉందని ఫిదా శ్రీ భాష్యం స్కూల్ లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి అయ్యప్ప శ్రీనివాస్, ఫార్మర్ టౌన్ ప్రెసిడెంట్ పూజ నరేందర్, సుధాకర్ ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్ మరియు ప్రైవేట్ పాఠశాల రాష్ట్ర బాధ్యులు క్రాంతి గంగారెడ్డి , మానస గణేష్, టి ఆర్ ఎస్ ఎన్ ఏ జిల్లా బాద్యులు జయసింహ గౌడ్, జనార్ధన్ నిత్యానందం నిర్మల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్య శ్రీనివాస్ రెడ్డి మరియు కార్యక్రమానికి విచ్చేసిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అసోసియేషన్ నాయకులు అందరికీ జిల్లా సైన్స్ ఆఫీసర్ గారికి పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు ,పాత్రికేయులకు, శ్రీ భాషిత తరఫున ధన్యవాదాలు తెలిపారు.
Leave a comment