నవనాతపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాత్ పుతే శ్రీనివాస్.
ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జీవన్ రెడ్డిని నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు పరమర్శించారు. శనివారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో ముఖాముఖిగా మాట్లాడుతూ హత్యయత్నం పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిస్ప్లే ద్వారా జరిగిన హత్య కుట్రను సభ్యులకు వివరించారు. హత్య పాల్పడిన ప్రసాద్ గౌడ్ పై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నవనాథపురం ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు సాత్పుతే శ్రీనివాస్,అధ్యక్షులు మంచిర్యాల నరేందర్, ఉపఅధ్యక్షులు పార్ధం సంజీవ్, కోశాధికారి గంగా మోహన్, చరణ్ గౌడ్ ,బొడ్డు శ్రావణ్ గంధం చిరంజీవి, రమణయ్య, ముఖేష్, రాజేందర్,సురేష్, తిరుపతి, గట్టడి అశోక్, మైపాల్, వెంకటేష్, లిక్కి శ్రావణ్, వినోద్, తదితరులు ఉన్నారు.
Leave a comment