ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిపై హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..
ఆర్మూర్, తెలంగాణ వార్త:: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిపై హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది రాజకీయంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని ఎదుర్కోలేని పిరికిపందల చర్య అని, రోజు ప్రజల కోసం వారి బాగోగుల కోసం ఆలోచించే వ్యక్తిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కల్లేడి గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ పై చట్ట రీత్యా తగు చర్యలు తీసుకోవాలని మున్నూరుకాపు సంఘం నాయకులు మాజీ కౌన్సిలర్ సడాక్ వినోద్ జిల్లా యూత్ సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి కోరారు. ప్రసాద్ గౌడ్ నిర్వహించిన రెక్కీ పై, హత్య ప్రయత్నం పై చాలా అనుమానాలు ఉన్నాయని ఆయన నేపాల్ వెళ్లి సుపారి గ్యాంగ్ లతో సంబంధాలు పెట్టుకుని, తుపాకులు, కత్తులు సమకూర్చుకునే స్థాయికి వెళ్ళాడంటే అతని వెనక నుంచి ఎవరో “ఎమ్మెల్యే ని హత్య చేయించడానికి సహకారం అందిస్తూన్నారు అనే అనుమానం కలుగుతోందన్నారు, ఇట్టి విషయమై పోలీస్ అధికారులు నిందితున్ని విచారించి ఈ కుట్ర వెనక ఉన్న వారందరినీ త్వరగా వెలికి తీయాలని, ఆయన వెనక ఉన్నది ఎంతటి వారైనా కటినంగా శిక్షించాలని కోరారు, ఇటువంటి చర్యలతో జీవన్ రెడ్డి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తే ఖబర్దార్ అని ఎచ్చరించారు దమ్ము ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో తెల్చుకోవాలి కానీ ఇటువంటి కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. హైద్రాబాద్ లో గాని, ఆర్మూర్ నియోజకవర్గంలో గానీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు జీవన్ రెడ్డి పై ఇలా చేయడం చాలా బాధాకరమని అన్నారు
ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కాపెల్లి చిన్న మూతేన్న, తెరాస నాయకులు కోడిగేలా మల్లయ్య, అల్లకొండ హరీష్ పాల్గొన్నారు
Leave a comment