మాక్లూర్, తెలంగాణ వార్త:: నియోజకవర్గ ప్రజల ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ అన్న గారి పైన జరిగిన “హత్యాయత్నం” ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్ నియోజకవర్గ “మున్నూరు కాపు”నాయకులు మాక్లూర్ మండలం మాణిక్ బండారులో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి హత్యాయత్నం లో పాత్రధారి అయిన వ్యక్తులతో పాటు సూత్రధారులను కూడా వెతికి పట్టుకొని చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఎల్లప్పుడు ప్రజాక్షేమాన్ని కోరే జీవన్ రెడ్డి లాంటి నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని, ఆర్మూర్ నియోజకవర్గ మునూరుకాపు కుటుంబ సభ్యులందరూ జీవన్ గారి రెడ్డి గారికి అండగా ఉంటారని, భగవంతుడు ఆయనకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ మున్నూరు కాపు నాయకులు ఆకుల రజనీష్, మీసాల సుదర్శన్, మచ్చర్ల సాగర్, సుక్కి సుధాకర్, సడక్ వినోద్, కాపల్లి ముత్తన్న, కాళ్ల గడ్డ దేవన్న, గోపుముత్యం,మల్యాల నర్సారెడ్డి, డీకంపల్లి భోజన్న, కొత్తూరు శ్రీనివాస్,ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మున్నూరు కాపు నాయకులు పాల్గొనడం జరిగింది.
Leave a comment