ఎమ్మెల్యే,PUC చైర్మన్ & టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి గారిని పరామర్శించిన మంత్రులు హరీష్ రావు గారు,గంగుల కమలాకర్ గారు
హైదరాబాద్, తెలంగాణ వార్త:: మొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి పైన జరిగిన హత్యాయత్నం గురించి ఈరోజు మంత్రి వర్యులు హరీష్ రావు గారు,గంగుల కమలాకర్ గారు,ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి గారు,క్రాంతి కిరణ్ గారు మరియు ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు హైదరబాద్ లో బంజారాహిల్స్ లో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి నివాసానికి విచ్చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు…
నిందితుడు ప్రసాద్ గౌడ్ రెక్కీ నిర్వహించిన తీరును సీసీ ఫుటేజ్ ద్వారా సమీక్షించారు.
ఈ హత్య కుట్రను వారు తీవ్రంగా ఖండించారు.
తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు…
ఎమ్మెల్యే గారి సతీమణి రజిత రెడ్డి గారిని దైర్యంగా ఉండమని భరోసానిచ్చారు…
ప్రసాద్ గౌడ్ కి సహకరించిన నిందితులని కఠినంగా శిక్షించాలని వారు పోలీస్ యంత్రాంగాన్ని వారు కోరారు.
Leave a comment