Home హాట్ న్యూస్ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనా చారి
హాట్ న్యూస్

ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనా చారి

నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి నియమితులయ్యారు. మధుసూదనాచారిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్​ను విడుదల చేసింది.
ఇప్పటికే ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. సర్క్యులేషన్ పద్ధతిన మంత్రివర్గం ఆమోదించింది. మంత్రుల సంతకాలతో రాష్ట్ర ప్రభుత్వం రాజ్​భవన్​కు దస్త్రం పంపింది. కౌశిక్ రెడ్డి పేరు స్థానంలో మధుసూదనాచారిని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ తమిళిసై ఆమోదించారు.
మధుసూదనాచారి ప్రస్థానం సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి 2014లో తెరాస తరఫున ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా తనదైన పంథాలో సేవలందించారు. 2018 ఎన్నికల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగి.. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి జిల్లాలో రాజకీయంగా ఆయన ప్రాధాన్యత తగ్గింది. గండ్ర తెరాసలో చేరిన తర్వాత క్రమంగా ఆయన ప్రాముఖ్యత క్షీణించింది.
శాసన మండలి సభ్యుడిగా కేసీఆర్ అవకాశం
పార్టీలో తన పరిస్థితి ఏంటో అర్థంగాక అగమ్యగోచర స్థితిలో ఉన్న మధుసూదనాచారికి తెలంగాణ సీఎం కేసీఆర్.. శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు తెరలేచాయి. ఆయనకు శాసన మండలి ఛైర్మన్​గా అవకాశం ఇస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడటంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కౌశిక్ ​రెడ్డి స్థానంలో తొలుత పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన సర్కార్.. గవర్నర్ తిరస్కరణతో ఆ అవకాశం మధుసూదనాచారికి ఇచ్చారు. ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి సర్కార్ ప్రతిపాదించి గవర్నర్​కు దస్త్రం పంపగా తమిళిసై సౌందరరాజన్ మధుసూదనాచారి నియామకాన్ని ఆమోదించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page