హైదరాబాద్( తెలంగాణ వార్త ]హైదరాబాద్ వాసులకు కొత్త ఏడాదిలో అలరించేందుకు 81 వ నుమాయిష్ సిద్ధమైంది. ఆదివారం నుంచి 45 రోజులపాటు జరగనున్న 81 వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధి ప్రకటించింది. వస్తు ప్రదర్శన కోసం జిహెచ్ఎంసి మరియు ఫైర్ సిబ్బంది ,పోలీసులు ,విద్యుత్ అన్ని శాఖల అనుమతులు తీసుకున్నట్లు సొసైటీ తెలిపింది. హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తూ కోవిడ్ నేపథ్యంలో ఈసారి సంఖ్యను 1600 కుదించినట్లు వారు తెలిపారు .పెరుగుతున్న కరోనా కేసులు ఓమీ క్రాన్ భయాలు నడుమ కోవిడ్ రక్షణ చర్యలను పగడ్బందీగా చేసి విజయవంతంగా నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభా శంకర్ తెలిపారు ప్రభుత్వ అ ప్రైవేటు శాఖలకు చెందిన వివిధ రకాల స్టాళ్లను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర తమిళనాడు జమ్మూ కాశ్మీర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రాష్ట్రాలు నుమాయిష్ లో దర్శనమిస్తారు.
Leave a comment