Home హాట్ న్యూస్ నిధుల దుర్వినియోగం నిజమే….!బుగ్గారం జి.పి లో రూ.1.77 లక్షలు రికవరీ చేసిన జిల్లా కలెక్టర్…
హాట్ న్యూస్

నిధుల దుర్వినియోగం నిజమే….!బుగ్గారం జి.పి లో రూ.1.77 లక్షలు రికవరీ చేసిన జిల్లా కలెక్టర్…

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అధికారిక లేఖ

సస్పెండ్ చేయకపోవడం శోచణీయం : చుక్క గంగారెడ్డి

బుగ్గారం/జగిత్యాల జిల్లా:, తెలంగాణ వార్త::

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం నిజమేనని తేలింది. రూ.1,77,761 – 00 లు గత విచారణలోనే రికవరీ చేసినట్లు ఆలస్యంగా అధికారిక లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. కానీ గ్రామస్తులు మాత్రం కోటికి పైననే నిధులు దుర్వినియోగం జరిగాయని ఆరోపిస్తున్నారు. నిధులు దుర్వినియోగం అయ్యాయని తేటతెల్లం చేసి రికవరీ చేసిన కలెక్టర్ సర్పంచ్, ఉప సర్పంచ్ లను సస్పెండ్ చేయకపోవడం శోచణీయం అని బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి అన్నారు. 2022 సెప్టెంబర్ 21న హైదరాబాద్ లోని లోకాయుక్తలో ఉన్నతాధికారులపై చుక్క గంగారెడ్డి పిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే…. ఆ మరుసటి రోజే… హుటాహుటిన కలెక్టర్ కార్యాలయం నుండి 2022 సెప్టెంబర్ 22న లేఖ నం. ఎ3/1501/2020 విడుదల చేసినట్లు తెలిసింది. ఆలేఖ ప్రకారం బుగ్గారం సర్పంచ్ నుండి మూడు పద్దుల ద్వారా మొత్తం సొమ్ము రూ. 1,77,761 -00 లు గత విచారణ లోనే రికవరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై గత విచారణలో రూ.10,48,490 – 00 లకు షోకాజ్ నోటీసులు / మెమోలు జారీ చేసి వారిచే సమర్పించిన సంజాయిషీలు పరిశీలించి మరొకమారు తప్పిదాలు చేయకుండా కలెక్టర్ (పం. వి.) జగిత్యాల నుండి లేఖ తేది: 22-07-2021 ద్వారానే మండలించడం జరిగిందని ఆలేఖలో అధికారులు సూచించారు.

2022 మే నెల 4 బుధవారం కొందరు నాయకులు నిబంధనలకు విరుద్ధంగా, చట్టవ్యతిరేకంగా ఎదుటి వారిని రెచ్చగొట్టే ప్రసంఘాలు చేస్తూ, హక్కుల సంఘాలను, ప్రజా సంఘాలను కించపరుస్తూ, తప్పుడు, అసత్యపు ఆరోపణలతో సమావేశం నిర్వహించిన దానిపై సర్పంచ్ ని అధికారులు వివరణ కోరగా తనకు ఎలాంటి సబందం లేదని, ఇట్టి సమావేశానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, సర్పంచ్ నుండి గానీ, పంచాయతీ కార్యదర్శి నుండి గానీ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని, భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకుంటామని వాంగ్మూలం సమర్పించారని ఆ లేఖలో అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సర్పంచ్ మూల సుమలత, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్ లతో పాటు పంచాయతీ కార్యదర్శి లను హెచ్చరించడం జరిగిందని ఆలేఖలో కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామపంచాయతీ రికార్డులు వెంటది వెంట విధిగా పర్యవేక్షించుటకు మండల పంచాయతీ అధికారిని ఆదేశించినట్లు కలెక్టర్ (పం. వి.) జగిత్యాల తరుపున జారీ చేయబడిన ఆలేఖలో సూచించారు.

ఈ సందర్భంగా పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి గురువారం విలేఖరులతో మాట్లాడారు. ఉన్నతాధికారులు నిధుల రికవరీని ఆలస్యంగా ప్రకటించడంలో అంతర్యం ఏమిటో…? దాగి ఉందన్నారు.
గత 2022 జూన్ 28న డిఎల్పీవో కనకదుర్గ 15 ఫిర్యాదులపై బుగ్గారం లో జరిపిన రెండో విడత విచారణలో తేలిన దుర్వినియోగం గూర్చి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. దానికి సంబంధించిన విచారణ నివేదిక కూడా తనకు అందజేయలేదని, ఆ విచారణ సంగతేమిటని ఆయన ఉన్నతాధికారులను ప్రశ్నించారు.
ప్రజాక్షేత్రంలో బయటపడ్డ నిధుల దుర్వినియోగం గురించి కూడా ఉన్నతాధికారులు ఊసే ఎత్తడం లేదన్నారు. స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా అవినీతి మయంలో కూరుకుపోయి నిధుల దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుతున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా బడా నేతల ప్రమేయం కూడా ఇందులో దాగి ఉందన్నారు. బుగ్గారం గ్రామపంచాయతీలో ఒక కోటి నుండి ఒక కోటి యాబై లక్షల వరకు నిధులు దుర్వినియోగం జరిగాయని ఆరోపించారు. త్వరలో పూర్తి వివరాలను, ఉన్నతాధికారుల బాగోతాలను బయట పెడుతామని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులపై, దీని వెనుక ఉన్న బడా నేతలపై, ప్రజాప్రతినిధులపై పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి పలు అనుమానాలను సైతం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ నక్క చంద్రమౌళి, విడిసి వ్యవస్థాపక సభ్యులు పెద్దనవేని రాగన్న, సుంకం ప్రశాంత్ తదితరులున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page