ఖమ్మం , తెలంగాణ వార్త: 30వ డివిజన్ పంపింగ్ రోడ్ నందు నివాసం ఉంటున్న పేద పద్మశాలి విద్యార్థిని నారాయణ నికిత D/O నారాయణ ఉపేందర్ ( లేటు ) జనరల్ నర్సింగ్ (GNM) చదువుకుంటున్న పాపకు కాలేజీ ఫీజు కోసం ఖమ్మం పద్మశాలి సంఘం మరియు ఖమ్మం జిల్లా ఉద్యోగ విభాగం వారి నుండి సేకరించిన పదివేల రూపాయలను సహాయం నిమిత్తముగా విద్యార్థిని నికిత తల్లికి ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మరియు 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి చేతుల మీదుగా అందించారు . ఈ సందర్బంగా కమర్తపు మురళి మాట్లాడుతూ నికితకు కళాశాలఫీజు నిమిత్తం ఈ సంవత్సరం నుండి పది వేల రూపాయలు చొప్పున మిగతా రెండు సంవత్సరాలు కూడా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు . నిరుపేద పద్మశాలి కుటుంబాలకు మరియు వారి పిల్లల చదువుల నిమిత్తం ఎప్పుడూ ఈ సంఘం అండగా ఉంటుందని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస్ బాబు , జిల్లా పద్మశాలి ఉద్యోగ విభాగం అధ్యక్షులు రచ్చ శ్రీనివాసరావు , నగర గౌరవ అధ్యక్షులు గుడ్ల వీరభద్రం , యువజన విభాగం సెక్రటరీ చందా వీరభద్రం , గుడ్ల శ్రీనివాస్ , బాలిని శీను , పులిపాటి సంపత్ , మసనం శివరామకృష్ణ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .
Leave a comment