Home హాట్ న్యూస్ పని చేసుకుని బ్రతుకుదాం అనుకుంటే బిచ్చమెత్తుకుని బ్రతుకు అంటున్నారు.
హాట్ న్యూస్

పని చేసుకుని బ్రతుకుదాం అనుకుంటే బిచ్చమెత్తుకుని బ్రతుకు అంటున్నారు.


ఆర్మూర్ పట్టణ ఖోకాల తొలగింపు వెనక కౌన్సిలర్ హస్తం ఉందని ఖోకాల యజమానులు అంటున్నారు?. చిరు వ్యాపారులు ఆందోళన.


ఆర్మూర్ తెలంగాణ వార్త ::ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా పరిధిలో గల ఖోకాలను తొలగించడంపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పని చేసుకుని బ్రతుకుదాం అనుకుంటే బిచ్చం అడుక్కునే బ్రతకండి అన్నట్టుగా ఉంది. మా జీవితాన్ని మున్సిపల్ అధికారులు ఖోకాలను తొలగించడంపై రోడ్డున పడ్డాయని దీని వెనకాల ఎవరి హస్తముందని చిరు వ్యాపారాలు వ్యక్తం చేస్తున్నారు వీరు 45 సంవత్సరాల నుండి ఇక్కడ కోకలు వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారం చేసుకుంటున్నామని ఈ ఖోకల వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు దారిన వెళ్లే పాదచారులు కానీ వాహనదారుల గాని ఎలాంటి ఇబ్బంది లేదని వారు వాపోతున్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఖోకాలను తొలగించడం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం పై తప్పనిసరి తిరుగుబాటు చేస్తామని వారు ఖరాఖండీగా అంటున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని మేము బజారున పడ్డ ఇప్పటివరకు దీనిపై స్పష్టత లేదని వారు ఆరోపించారు గత నలభై ఐదు సంవత్సరాలుగా లేని మురికి కాలువ సమస్య ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చిందో తెలియడం లేదని వారంటున్నారు మున్సిపల్ కు చెందిన ఒక కౌన్సిలర్ వల్లే ఈ తతంగం అంతా జరిగినట్టు వారికి సమాచారం ఉందని అంటున్నారు కౌన్సిలర్ వెనుక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హస్తం ఉందని వారు చెబుతూ ఒకవేళ మా ఖోకల ను మళ్లీ పునరుద్ధ రించి కుంటే రాబోయే ఎన్నికల్లో జీవన్ రెడ్డి కి మున్సిపల్ కౌన్సిలర్ లకు గుణపాఠం చెప్తామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 45 నుండి 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెబుతూ వాపోయారు ఇప్పటికైనా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమ పరిస్థితి అర్థం చేసుకుని మా వ్యాపారం కొనసాగే టట్టు చేస్తే జీవన్ రెడ్డి కి అందరం పూలమాలలు వేసి సత్కారం చేస్తామని అలాగే జీవన్ రెడ్డి వెంటనే ఉంటామని వారు వారి మాటల్లో పేర్కొన్నారు. ఈ విషయమై కమిషనర్ గారికి వివరణ కోరగా 15 రోజుల్లో డ్రైనేజీ పని పూర్తి చేసి మళ్లీ ఎవరికి వారు ఖోకోల ను వేసుకునేందుకు పర్మిషన్ ఇస్తామని కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలంగాణ వార్త కు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page