Home హాట్ న్యూస్ తెలంగాణలో జూన్ నెలలో టీచర్ల ఉద్యోగాల కోసం కోసం టెట్ పరీక్షలు ప్రకటించిన విద్యాశాఖ.
హాట్ న్యూస్

తెలంగాణలో జూన్ నెలలో టీచర్ల ఉద్యోగాల కోసం కోసం టెట్ పరీక్షలు ప్రకటించిన విద్యాశాఖ.

తెలంగాణ వార్త:: టెట్‌ పరీక్షను జూన్‌ 12న నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెల్పింది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 13,086 పోస్టుల్లో 10,000లవరకు టీచర్‌ పోస్టులున్నాయి. వీటిల్లో 6,700ల వరకు ఎస్జీటీ ఉపాధ్యాయ కొలువులు (ఆదర్శ పాఠశాలల్లోని ఖాళీలను కూడా కలుపుకుంటే 11,000ల వరకు ఉండొచ్చిని అంచనా) ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే టీచర్‌ నియామకాలకు ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణలో టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి.

గతంలో 2016 మే, 2017 జులైలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది టెట్‌లో బీఈడీ అభ్యర్ధులకు మరో సదావకాశాన్ని కల్పిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అందేంటంటే.. ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6 – 10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు 1 – 5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్‌ 1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో 6 నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులుగా ఉండేవారు. అంతేకాదు.. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు 7 ఏళ్ల కాలపరిమితి ఉండేది. గడువు ముగిశాక మళ్లీ టెట్‌ రాసుకోవాల్సిందే. ఐతే అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page