నిజామాబాద్/ నందిపేట్ తెలంగాణ వార్త:
పాత నేరస్తులపై నిఘా పెంచాలని జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశించారు, వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం పోలీస్ కమిసనర్ కె.ఆర్. నాగరాజు నందిపేట్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డ్ ల పరిశలన చేసిన సందర్బంగా పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి పలు ఆదేశాలు చేశారు.
పాత నేరస్తుల పై ప్రత్యేకదృష్టి పెట్టలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో బాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు ప్రజలకు అవగాహన కల్పించి మస్జీద్ , మందిరాల వద్ద సి సి కెమెరాలు ఏర్పాటు కొరకు కృషి చేయాలని తెలిపారు.
ముందుగా పోలీస్ స్టేషన్ యందు మొక్కను నాటి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను , సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల సుందరికరణ, చెట్ల పెంపకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి ఎస్సై సల్ల శ్రీకాంత్ ను సిపి అభినందించారు. ఇది వరకు ప్రజాజ్యోతి పత్రికలో వచ్చిన “నందనవనం నందిపేట్ థానా” ఆర్టికల్ ను చదివానాని గుర్తు చేశారు. కోర్ట్ డ్యూటీ రికార్డులు , హెచ్.ఆర్.ఎమ్.ఎస్ విధానము అమలులో చక్కగా విధులు నిర్వహించిన సిబంధిని సైతం అభినందించారు . ఈ కార్యాక్రమంలో ఆర్మూర్ డివిజన్ ఎ.సి.పి శ్రీ ఆర్. ప్రభాకర్ రావు, ఆర్మూర్ రూరల్ సి ఐ బి. గోవర్ధన్ రెడ్డి, నందిపేట్ ఎస్.ఐ ఎస్.శ్రీకాంత్, సిబ్బంది వున్నారు.
Leave a comment