తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. స్థానిక సీఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న యువకుడిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి విచక్షణారహితంగా కొట్టినట్లు చెబుతున్నారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు మండపేటలో ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. మండపేట గాంధీనగర్‌కి ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ (22) అనే యువకుడు అదే కాలనీకి చెందిన ఓ ఇంటర్ బాలికను ప్రేమించాడు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు స్థానిక మండపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ దుర్గా ప్రసాద్ విచారణ నిమిత్తం భగవాన్ని పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన యువకుడు సీఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కుటుంబ సభ్యులతో చెప్పాడు.
తమ ఇంటికి సమీపంలోని పొలంలో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భగవాన్ కుటుంబ సభ్యులు అతని మృతదేహంతో మండపేటలో ఆందోళనకు దిగారు. సీఐ దుర్గా ప్రసాద్ రూ.20 వేలు లంచం తీసుకుని భగవాన్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని ఆరోపించారు. మల ద్వారంలో లాఠీలు చొప్పించి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై డీఎస్పీ బాలచంద్రారెడ్డి స్పందిస్తూ.. సీఐ దుర్గా ప్రసాద్‌ను వీఆర్‌కు పంపించినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదన్నారు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ తర్వాత సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు
Leave a comment