తెలంగాణ వార్త 24 ఏప్రిల్ రాజ్యాంగానికి ప్రమాదం ఉంది అని, రాజ్యాంగాన్ని మార్చాలన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక అధ్యక్షులు బచ్చలకూర బాలరాజ్ ఆధ్వర్యంలో లిబర్టీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభ
జెండా ఊపి డప్పుల దరువుల ర్యాలీనీ ప్రారంభించారు,
అంబేద్కర్ విగ్రహంనికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించి ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే మాడి మసై పోతారని విమర్శించారు,
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ,
మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యపాగా నర్సింగ్ రావు మాదిగ హాజరయ్యారు
తదనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ
రాజ్యాంగాన్ని మార్చాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాటలతో విరుచుకుపడ్డారు, రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరి తరం కాదు అని హెచ్చరించారు, రాజ్యాంగంలో ఇంకా కొన్ని ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరచలని డిమాండ్ చేశారు,
మీసాల రాము మాదిగ, గడ్డ యాదయ్య మాదిగ, ముఖ్య భాగం నర్సింగ్ రావు మాదిగలు మాట్లాడుతూ
బడుగు బలహీన వర్గాల ప్రజలకు, భూమి మీద ఉండే ప్రతి జీవికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కల్పించిన ఒకే ఒక గ్రంథం భారత రాజ్యాంగం, అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని మారితే చూస్తూ ఊరుకోమని మీ యొక్క పూర్తి చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించారు
ఈ యొక్క కార్యక్రమంలో మహా ఎమ్మార్పీఎస్ మహిళ జాతీయ అధ్యక్షులు జాజల రమ్య మాదిగ, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూప మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరస్వతి, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ పువ్వుల విజయ్ మాదిగ, రాష్ట్ర ఇన్చార్జి మీసాల ఎల్లేష్, తెలంగాణ దండోరా రాష్ట్ర కార్యదర్శి కల్మురి రాములు మాదిగ,
మాల మహానాడు రాష్ట్ర నాయకులు పబ్బతి శ్రీ కృష్ణ,
తెలంగాణ దళిత దండు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రమల మొగులయ్య, తెలంగాణ దండోరా నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి మంతటి గోపి మాదిగ, తెలంగాణ దండోరా నాగర్ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు బాకీ రేణుక,
తెలంగాణ దండోరా నాయకులు తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ దళిత ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Leave a comment