ఆర్మూర్, 24 ఏప్రిల్, (తెలంగాణ వార్త) పవిత్ర సిద్ధుల గుట్టపై పురాతన కాలములో తొమ్మిది మంది సిద్దులు తపస్సు చేసారు, అందుకే నవనాథ సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు యాదృచికమో, ఆ శివుడి సంకల్పమో గాని తొమ్మిది మంది గౌరవ న్యాయమూర్తులు ఆర్మూర్ పట్టణములోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం సిద్ధుల గుట్టపై నెలకొన్న స్వయంభూ శివలింగం యొక్క ప్రాముఖ్యత, మహత్యం తెలుసుకుని దర్శనానికి వచ్చారు. గౌరవ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల గారు, సీనియర్ సివిల్ జడ్జి గార్లు శ్రీమతి కిరణ్మయి గారు, శ్రీ J. విక్రమ్ గారు, నిజమాబాద్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తులు శ్రీమతి కళార్చన గారు, శ్రీ అజయ్ జాదవ్ గారు, శ్రీమతి గిరిజా గారు, ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రాచర్ల శాలిని గారు, అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి దీప్తి గారు మొదలగువారు నవనాథ సిద్దులగుట్టపై వెలసిన స్వయం భూ శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేసారు. పురోహితులు కుమార శర్మ గారి నేతృత్వములో గౌరవ న్యాయమూర్తులకు ప్రత్యేక అర్చనలు చేసారు. బార్ అసోసియేషన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యములో న్యాయవాదులు స్వాగతం తెలిపారు. ఈ సందర్బంగా గౌరవ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల గారు మాట్లాడుతూ పవిత్ర సిద్ధుల గుట్ట మహత్యం గురించి విని దర్శనానికి గౌరవ న్యాయమూర్తులతో కలిసి వచ్చాము, గుట్టపై అద్భుతంగా ఉందని, చాలా అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గౌరవ న్యాయమూర్తులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో ఏసీపీ రఘు గారు, సీఐ శ్రీధర్ గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంట విప్లవ్ కిరణ్ గారు, ఉపాధ్యక్షులు టీకే కోనేరు గారు, ప్రభుత్వ న్యాయవాది MK నరేందర్ గారు Addl PP అవారి రమేష్ గారు, సీనియర్ న్యాయవాదులు గంటా సదానందం గారు, కృష్ణ పండిత్ గారు, శ్రీనివాస్ ఖాందేష్ గారు, RK సురేష్ గారు, బేతు జగదీష్ గారు, ఏలేటి గంగాధర్ గారు, జంగం మురళీధర్ గారు, గట్టు గంగాధర్ గారు న్యాయవాదులు సంగీతా ఖాందేష్ గారు, వెంకట్ రావు షిండే గారు, సాయి కృష్ణా రెడ్డి గారు, రాజేందర్ గారు, నాగరాజు గారు మరియు న్యాయాధికారులు, న్యాయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…..
Leave a comment