ఆర్మూర్, తెలంగాణ వార్త:. బాల్కొండ మండలం ముప్కల్ గ్రామంలో శనివారం రాత్రి బస చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండగా గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యాబోధన రోజువారి దినచర్య తదితర వివరాలు పాఠశాల ప్రిన్సిపాల్ కే సురేందర్ ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గది సందర్శించే విద్యార్థులు కలెక్టర్ భేటీ అయ్యారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులను పర్సనల్ అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వపరంగా వారికి అందించిన పాఠ్యపుస్తకాలు నోట్బు బుక్కులు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి పాఠశాలల్లోనే కలెక్టర్ నిద్రించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్ ఉన్నారు.
Leave a comment