దేగాం ,తెలంగాణ వార్త ::
ప్రగతిశీల యువజన సంఘం PYL ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో ప్రాథ
మిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు, ఈ సందర్భంగా PYL జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూజ,ప్రవీణ, సిబ్బంది కాంతయ్య, గంగాధర్ లతో మాట్లాడి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, మందుల లభ్యత తదితర వివరాలు తెలుసుకోవడం జరిగిందని ముఖ్యంగా వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాదులు విజృంబించే అవకాశం ఉన్నందున ఆయా PHC లలో డాక్టర్లు, సిబ్బంది, మందులు, సమస్యలపై సర్వేలు చేపట్టడం లో భాగంగా ఈరోజు దేగాం PHC లో వివరాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు, ఇక్కడ మెడికల్ ఆఫీసర్ డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారని, అటెండర్ పోస్టు ఖాళీగా ఉందని ఇప్పటికే తీవ్ర వర్షాల కారణంగా ఆస్తి నష్టం ,పంట నష్టం జరిగిందని మరోవైపు సీజనల్ వ్యాదులు ప్రబలుతున్నాయి విషజ్వరాలు, డయేరియా, చికెన్ గున్యా, డెంగీ లాంటివి ప్రబలుతాయని కావున వైద్య ఆరోగ్య శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టాలని అట్లాగే ప్రజలు కూడా స్వీయ శుభ్రత పాటిస్తూ ఇంటిని, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించాలని పాలకవర్గం కూడ గ్రామంలో క్లోరినేషన్, ఫాగింగ్ లాంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు, PYL ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నామని అనంతరం అన్ని వివరాలు సేకరించి వాటి పరిష్కారం కోసం జిల్లా సెంటర్ లో DMHO కార్యక్రమం చేపడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో PYL జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్, మండల కార్యదర్శి మనోజ్, కిషోర్, గ్రామ నాయకుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment