Home హాట్ న్యూస్ రంజాన్ పండగ కోసం ముస్తాబయిన ఈద్గాహ్ లు
హాట్ న్యూస్

రంజాన్ పండగ కోసం ముస్తాబయిన ఈద్గాహ్ లు

తెలంగాణ వార్త తరపున రంజాన్ శుభాకాంక్షలు మోహన్ ఫౌండర్.
నందిపేట్: తెలంగాణ వార్త
భారత దేశ మంతట భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాలు పాటించిన ముస్లిం లు మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకోనున్నరు. అలాగే నిజామాబాద్ జిల్లా లోని నందిపేట్ మండలం లోని ముస్లింలు మంగళవారం ఉదయం ఇద్ నమాజ్ కొరకు ముందస్తుగా సోమవారం ఈద్ గాహ్ లను సోమవారం ముస్తాబు చేశారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం శుభ్రత పనులు చేపట్టగా ముస్లిం కమిటీ లు టెంట్ సమియణలు వేశారు.
నెల రోజుల పాటు మండుటెండ లను సైతం లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం లో సోమవారనికి 30 దినాలు పూర్తి కావడంతో సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించి మంగళవారం(ఈద్-ఉల్-ఫితర్ ) పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు దీంతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న ముస్లిం లు మంగళవారం ఉదయం కొత్త బట్టలు ధరించి సామూహికంగా తక్బీర్ చెప్తూ గ్రామాల సమీపంలోని ఈద్గాల వద్ద చేరుకుని ఫేస్ ఇమామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేస్తారు.
ఎం పి పి, సంతోష్ , జడ్ పి టి సి ఎర్రం యమున ముత్యం, నందిపేట్ సర్పంచ్ ఎస్ జి వాణి తిరుపతి, కో అప్సన్ మెంబెర్ సయ్యద్ హుస్సేన్, మండల ముస్లిం కమిటీ నాయకులు కాలీమ్, గౌస్ తదితరులు మండల ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిప దాన దర్మాల మాసం.. రంజాన్.
జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ ఆఫ్రోజ్ ఖాన్.
రంజాన్ మాసం దాన దర్మాల మాసంగా ముస్లిం ప్రజలు గుర్తించి తమ సంపాదనలోని కొంత భాగాన్ని పేద ప్రజల హక్కుగా భావించి భావించి వరాల వసంత మైన రంజాన్ మాసంలో విరివిగా దానధర్మాలు చేస్తారని జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ ఆఫ్రోజ్ ఖాన్.తెలిపారు.
జమాతే ఇస్లామి హింద్ నందిపేట్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మస్జీద్ మౌజా బింతే అలీ చుట్టూ ప్రక్కల గల ఎన్టీఆర్ కాలనీలో మరియు బజార్ కొత్తూరు లోని పేద ముస్లిం లకు ఈద్ కిట్లను ఆటోలో వేసుకొని ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. పేద ధనిక ప్రజలందరూ కలిసి ఈద్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో జమాత్ సభ్యలు, సానుభూతి పరులు తమ సంపాదనలో నుండి జకత్ రూపంలో చెల్లించిన రూపాయలతో ఈద్ కిట్ కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు ఎలాంటి ఫోటో ఘాట్ లు చేయకుండా తమ ఇంటి గుమ్మం వద్ద పెట్టి వెళ్లి తమ ఆత్మ గౌరవము పెంచడం పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ గౌస్, టి ఆర్ ఎస్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ పాషా, ఉర్దూ స్కూల్ చైర్మన్ అబ్దుల్ బాఖి, జమాత్ సభ్యలు రఫీ, ఫారూక్ ఖాన్, బిలాల్, కలీమ్, మహేబూబ్ ఖాన్, తదితరులు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page