Home హాట్ న్యూస్ రంగారెడ్డి కలెక్టర్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు..
హాట్ న్యూస్

రంగారెడ్డి కలెక్టర్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు..

29-09-2022 రంగారెడ్డి జిల్లా, తెలంగాణ వార్త:
మహిళలందరూ ఆనందంగా అత్యంత వైభవోపేతంగా జరుపుకునే పండుగ అని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
గురువారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియలతో కలిసి పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆనందాలను, ఆప్యాయతలను పంచడమే కాకుండా బతుకమ్మ పండుగ విలువలకు అద్దం పడుతుందని అన్నారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే ఆచారం సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఈ పండుగను మహిళలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారని, మహిళా స్వావలంబన చెందాలనే గొప్ప ఆశయం బతుకమ్మ సంబరాలలో ఉందనీ, బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు.
అనంతరం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా కలెక్టర్ అమోయ్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ వేడుకలలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి మోతి, ఎఓ ప్రమీల, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, వివిధ మండలాల సీడీపీఓలు, సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page