జూబ్లీహిల్స్( తెలంగాణ వార్త )కన్నకూతురిపై తండ్రి అత్యాచారం ఘటన బంజర హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారా హిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవర్ భార్యకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగాలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చిన సోదరుడితో కలిసి పిల్లలను తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే కుమార్తె ఇద్దరు కుమారులు తన వద్దనే ఉంచుకుంటాం అని భర్త చెప్పడంతో ఆమె సోదరి తో కలిసి వెళ్ళింది. ఈ నెల 9న ఇంటికి వచ్చిన తండ్రి అర్ధరాత్రి దాటిన తర్వాత కుమార్తె (15) నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మరుసటి రోజు తన సోదరుడికి తెలియజేయగా ఇద్దరు కలిసి మహబూబ్నగర్ అన్న, తల్లి వద్దకు వెళ్లారు. జరిగిన విషయాన్ని చెప్పడంతో శుక్రవారం నగరానికి వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై ఐపీసీ సెక్షన్ లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు .నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Leave a comment