Home హాట్ న్యూస్ రెబల్ స్టార్ సినీ హీరో కృష్ణంరాజు(83) ఇకలేరు.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రగాఢ సంతాపం…
హాట్ న్యూస్

రెబల్ స్టార్ సినీ హీరో కృష్ణంరాజు(83) ఇకలేరు.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రగాఢ సంతాపం…

హైదరాబాద్, తెలంగాణ వార్త:: హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు కృష్ణంరాజు ఒకరు. ఈయన సీనియర్ హీరోలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం ఉన్న స్టార్ హీరో ఆయన…వరసాల్లోని ఏ రసాన్నైనా అలవోకగా పండించి సత్తా చూపిన నిన్నటితరం హీరో ఈ రోజు తీవ్ర అస్వస్థతో హైదరాబద్ ఈ రోజు ఉదయం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. 82 సం: ఈయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కృష్ణంరాజు
పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు..ఈయన 1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 2022 సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. ఈయన వయసు 82 యేళ్లు. 1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో హీరోగా సినీరంగప్రవేశం చేసిన ఈయన ఈ యేడాది తన తమ్ముడు తనయుడు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాలో ముఖ్యపాత్రలో అలరించారు. ఆజానుబాహుడైన కృష్ణంరాజు..మొదట హీరోగా పరిచయమైనా..తరువాత చేసినవన్నీ విలన్ పాత్రలే…అయినా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తిరిగి హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఎన్ టి .ఆర్, ఎ.ఎన్ ఆర్ తర్వాత రెండోతరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు తర్వాత తనకంటూ గుర్తుంపును, స్థానాన్ని సంపాదించుకున్న హీరో కృష్ణంరాజు.
83 యేళ్లు వయసులో దాదాపు 55 యేళ్లకు పైగా నటుడిగా తన ప్రస్థానం సాగింది. మొత్తంగా ఎన్నో మెమరబుల్ మూవీస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన కృష్ణంరాజు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు. ఈయన మృతిపై తెలంగాణ వార్త తీవ్ర సంతాపం తెలుపుతుంది.

  • కృష్టం రాజు మృతి పట్ల జీవన్ రెడ్డి సంతాపం
    :- రెబల్ స్టార్ కృష్టం రాజు*

–——————–+————————————————
(83) మృతి పట్ల పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణ నటులుగా ఎనలేని ప్రజాభిమానం పొందిన ఆయన మరణం వెండితెరకు తీరని లోటు అని పేర్కొంటూ తీవ్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కృష్టం రాజు కుటుంబ సభ్యులకు జీవన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page