ఆర్మూర్ (తెలంగాణ వార్త)ఆర్మూర్ పట్టణములోని వడ్డెర కాలోని కి చెందిన వరికుప్పల గంగాధర్ అను TRS కార్యకర్త గత రెండు సం,,ల క్రితం నిర్మాణములో వున్న ఒక ఇంటికి సెంట్రింగ్ పనులు చేస్తుండగా రెండు అంతస్తుల భవనం పై నుండి ప్రమాదవశాత్తు క్రింద పడి బలమైన గాయాలతో చనిపోవడం జరిగింది. అప్పుడు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆశన్నగారి జీవనన్న గారు స్థానిక కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ చేయించిన తెరాస పార్టీ సభ్యత్వం ద్వారా 2 లక్షలు పార్టీ నుంచి ఇప్పించారు. చనిపోయిన వ్యక్తికి భవన నిర్మాణ కార్మిక సభ్యత్వం కూడా కౌన్సిలర్ చేయించి ఉన్నందున గౌరవ ఎమ్మెల్యే జీవనన్న గారు, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజేశ్వరన్న గార్లు ఇటీవల అతని కుటుంభ సభ్యులకు కార్మిక శాఖా ద్వారా మంజూరు చేసిన రు,, 6,30,000/- ల చెక్కును కౌన్సిలర్ మరియు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సంగీతా ఖాందేష్ గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం ద్వారా, TRS పార్టి ద్వారా డబ్బులు ఇప్పించి మా కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే శ్రీ జీవనన్న గారికి, నియోజకవర్గ ఇంచార్జి శ్రీ రాజేశ్వరన్న గార్లకు కృతఙ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమములో TRS నాయకులు ఖాందేష్ సత్యం, బండారి నరేశ్, మక్కల సాయిలు, భూమేష్, ప్రశాంత్ తదితరులు వున్నారు
జై జీవనన్న , జై రాజేశ్వర్ అన్న
Leave a comment