పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి క్యాడర్ లేదు,క్యారెక్టర్ లేదు
పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటర్
ఆర్మూర్ (తెలంగాణ వార్త)*రేవంత్ రెడ్డి వంటి నాయకులు గాంధీ భవన్ లో ఫిడేల్ వాయించుకునే నీరోలు
*ఇలాంటి నాయకుల కింద పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలు హీరోలు కాదు జీరోలు
*తెలంగాణ లో 40లక్షల కాంగ్రెస్ సభ్యత్వం అయ్యిందనడం పెద్ద జోక్.
*దేశమంతా కలిపినా ఇంత సభ్యత్వం ఉంటదా?
*రేవంత్ రెడ్డి కార్యకర్తల నమ్మకం నిలబెట్టుకునే అధ్యక్షుడు కాదు
*చంద్రబాబు నమ్మకం నిలబెట్టుకొని గాంధీ భవన్ కు టూ-లెట్ బోర్డు పెట్టే అధ్యక్షుడు.
*హుజూరాబాద్ 3వేల ఓట్లు తెచ్చుకోలేనోడు 80లక్షల ఓట్లతో 90సీట్లు తెస్తాడట.
*కాటికి కాలు చాపిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరుతారు? ఎక్కడా చెల్లుబాటు కానోళ్లు తప్ప.
*కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు, పథకాలు ఇచ్చేది లేదు.
*వడ్లు కొనమని కేంద్రానికి ఒక్క మాట చెప్పనోడు పండించిన ప్రతీ గింజను కొంటాడట.
*గాంధీ భవన్ లో ఉన్న నలుగురే ఉద్యోగాలు లేక కొట్టుకు చస్తున్నారు.
*కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలోనే రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తాడట.
*కాంగ్రెస్ హయాంలో ఆసుపత్రులను మార్చూరి గదుల కన్నా హీనంగా మార్చారు
*ఈ మొనగాడు అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత వైద్యం చేయిస్తాడట.
*కేసీఆర్ కు ఫ్రంట్ ఉందో టెంట్ ఉందో ఆయన కొట్టే దెబ్బకు రేవంత్ రెడ్డి లాంటోళ్లు వంటికి ఆయింట్ మెంట్ రాసుకొని పండుకున్నప్పుడు తెలుస్తది.
*డిసెంబర్ లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తాడని, మార్చిలో ఎన్నికలొస్తాయని రేవంత్ రెడ్డి చిలక జ్యోతిష్యం చెప్పుతుండు.
*వచ్చే ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బతుకు చిలక జ్యోతిష్యాలు చెప్పు కోవడమే.
*కేసీఆర్ దేశదిమ్మరి కాదు.. దేశాన్ని కాపాడే వెలుగు
*కాంగ్రెస్ దేశాన్ని రక్షించే పార్టీ కాదు..భక్షించే పార్టీ.
*రాహుల్ ప్రధాన మంత్రి అయితే దేశానికి రక్ష కాదు..భరించలేని శిక్ష.
*నిన్న రేవంత్ రెడ్డి మాటలను బట్టి పిట్టల దొర అని తేలింది.
*ఒక బుడ్డర్ ఖాన్..సంస్కార హీనుడు
*నువ్వు పట్టపగలే పట్టుబడ్డ గజదొంగ
*చిప్పకూడు తిన్న చిల్లరగాడివి
*రేవంత్ రెడ్డి అంటే లూటీ.
*అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ వు
*భూబకాసురుడువి..అభినవ నరకాసురుడివి.
*కేసీఆర్ ఒక ఫైటర్.
*రేవంత్ ఒక చీటర్
*ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో.
*నీ బజార్ భాష మార్చుకో
*లేకుంటే నువ్వే ఆగమవతవు.
Leave a comment