ఆర్మూర్ ,తెలంగాణ వార్త:: మంగళవారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల లో సమాచార హక్కు చట్టంపై జిల్లా కన్వీనర్ న్యాయవాది
గటడి ఆనంద్ విద్యార్థినులకు అవగాహన కల్పించారు. గ్రామస్థాయి నుండి పార్లమెంట్ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో తమకు కావలసిన సమాచారం తెలుసుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందన్నారు రాజుల కాలంలో రాజుకు తన రాజ్యంలో అన్ని విషయాలు తెలిసుండేవి కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే రాజులని రాజుకు అన్ని విషయాలు ఈ చట్టం ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుదారునికి అడిగిన సమాచారం 30 రోజుల్లో ఇవ్వాలన్నారు ఒకవేళ ఇవ్వనట్టయితే పై అధికారికి అప్పీలు చేయాలన్నారు. దరఖాస్తుదారునికి అధికారి తప్పుడు సమాచారం ఇచ్చిన అసంపూర్తి సమాచారం ఇచ్చిన రాష్ట్ర కమిషన్ రోజుకు 250 నుండి 25000 వేల వరకు జరిమానా విధించే ఆస్కారం ఉందన్నారు. దేహానికి నాడీ వ్యవస్థ ఎలా ఉందో దేశానికి సమాచార హక్కు చట్టం అలాంటిది అన్నారు విద్యార్థి దశ నుండి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. మరియు దరఖాస్తు ఇలా చేసుకోవాలో వివరంగా తెలిపారు చట్టం ద్వారా సాధించిన విజయాలు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి రాగలత వైస్ ప్రిన్సిపల్ స్పందన లక్ష్మి భువన స్వర్ణలత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
దోండి మోహన్ 9440023558
Leave a comment