ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత
-డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి
-మచ్చర్ల,చిక్లి,గుంజిలి ఎత్తిపోతలనుమంజూరు చేయండి
-అసెంబ్లీ లో జీవన్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి15:-
ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా ఉన్న వైద్య సిబ్బంది కొరత తీర్చాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ జీరో అవర్ లో మాట్లాడుతూ ఆర్మూర్ దవాఖాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆర్మూర్ ఆసుపత్రి 30నుంచి వంద పడకలకు అఫ్ గ్రేడ్ అయ్యిందని, భవనాల నిర్మాణం కూడా పూర్తి ఆయిందన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుంచి నేను వస్తా ఆర్మూర్ ఆసుపత్రికి అనే స్థాయికి చేరిందన్నారు. వంద పడకల కోవిడ్ సెంటర్ గా కూడా సేవలు అందించింద న్నారు. 20వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయన్నారు. అయితే డాక్టర్లు, ఇతర సిబ్బంది తీవ్రంగా ఉందని జీవన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చి వెంటనే ఆసుపత్రిలో అన్ని ఖాళీ లను భర్తీ చేయాలని కోరారు. అలాగే ఆర్మూర్ దవాఖానకు ఒక డయాలసిస్ సెంటర్ ను కూడా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా వుండగా ఆర్మూర్ నియోజకవర్గంలోని మచ్చర్ల,చిక్లి,గుంజిలి ఎత్తిపోతలకు వెంటనే ఆమోద ముద్ర వేసి పనులు చేపట్టాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ లిఫ్ట్ ఇర్రిగేషన్ పథకాల అంచనాలు కూడా పూర్తి అయ్యాయని, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చి జీవో జారీ చేయడమే మిగిలి ఉందని జీవన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
Leave a comment