…
రైతు శిక్షణ తరగతులలో తెలిపిన శాస్త్ర వేత్తలు.
నందిపేట్, తెలంగాణ వార్త
నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్ర రైతు వేదికలో క్షేత్ర ప్రదర్శన పై శిక్షణ తరగతులు నిర్వహించారు.
నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక లో శనివారం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించి పలు సూచనలు చేశారు.. శాస్త్ర వేత్తలు మాట్లాడుతు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయాన్ని చేయాలని రైతులకు తెలిపారు. శాస్త్రవేత్తల, వ్యవసాయ అధికారుల సలహాలు పాటించి లాభలు ఆర్జించాలని కోరారు.
కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూర్ సమన్వయకర్త డాక్టర్ ఎస్. నవీన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంటలైన వరి సోయా చిక్కుడు , పసుపు పంటలలో రైతులు శాస్త్రవేత్తల మరియు వ్యవసాయ శాఖ అధికారుల శాస్త్రీయ పద్ధతులను అవలంబించి వాటిలో ఎరువులు అలాగే కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే లాభదాయకమైన పంట దిగుబడులు సాధించవచ్చు అని వివరించారు. అలాగే మనకు ఎరువుల వడకాన్ని తగ్గించుకుని సేంద్రీయ మరియు పచ్చి రొట్టె ఎరువులు అయినా జనుము జీలుగా వరికి ముందు వేసుకుని భూమిలో కలియదునుకున్నట్లయితే నత్రజని ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచించారు. జిల్లాలోని వ్యవసాయ పొలాల్లో భాస్వరం నిలవలు అధికంగా ఉన్నందువల్ల ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వినియోగాన్ని రైతులు పెంచాలని అలాగే బాస్ ఫర్ ఎరువులు వాడకాన్ని తగ్గించి సాగు ఖర్చుని తగ్గించుకోవాలని సూచించారు.
సమతుల్య ఎరువుల యాజమాన్యం చేపట్టి సేంద్రీయ అలాగే రసాయన ఎరువులు తగు మోతాదులో వేసుకొని పసుపు పంటను పండించినట్లయితే ఖర్చు హోదా చేసుకోవడమే గాక నాణ్యమైన తెగుళ్ల రహిత పసుపు పంటను రైతులు పొందవచ్చని సూచించారు.
కార్యక్రమంలో , ఆర్మూర్ ఏ డి ఏ విజయలక్ష్మి, ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, , వ్యవసాయ అధికారి జోష్నా భవాని, టిఆర్ఎస్ నాయకులు సాయి రెడ్డి, కొత్తూరు బాబు రాజ్, ఆరు క్లస్టర్ల ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
Leave a comment