Home హాట్ న్యూస్ శేర్ లింగంపల్లి టి పి ఓ పై ఏసీబీ దాడి పలు కీలక ఆధారాలు లభ్యం3.5 కోట్లు సీజ్:కొందరు అధికారులు పరార్.
హాట్ న్యూస్

శేర్ లింగంపల్లి టి పి ఓ పై ఏసీబీ దాడి పలు కీలక ఆధారాలు లభ్యం3.5 కోట్లు సీజ్:కొందరు అధికారులు పరార్.

హైదరాబాద్:, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి ( తెలంగాణ వార్త) ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణపై హైదరాబాద్ కార్పొరేషన్ చెందిన శేర్ లింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహులు పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పలుచోట్ల బినామీ పేరిట అక్రమ ఆస్తులు ఉన్నట్టు విచారణలో తేలడంతో ఇంకా రెండు చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా ఉన్న నర్సింహ రాములపై ఏసీబీ అనేక ఫిర్యాదులు రావడంతో ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆయన కుటుంబీకులకు సంబంధించి వారిపై నిఘా పెట్టిన ఏసీబీ కీలక డాక్యుమెంట్లను సేకరించింది. దీనితో ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నట్లు ధృవీకరించుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలిపింది. నివాసాలు, కార్యాలయాల్లో పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ పేరిట కొనుగోలు చేసిన భూములు, బంగారం, నగదును స్వాధీ నం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను శుక్రవారం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఏసీబీ అధికారులు సిటీ ప్లానర్‌ చాంబర్‌ను సీజ్‌ చేయడంతో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఆందోళనకు లోనయ్యారు. రెండో అంతస్తులో ఉన్న జోనల్‌ టౌన్‌ ప్లానింగ్‌లో పనిచేసే ఏసీపీలు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పత్తా లేకుండా పోయారు. అకౌంట్స్‌ సెక్షన్‌తో పాటు మొదటి అంతస్తులో ఉన్న శేరిలింగంపల్లి సర్కిల్‌-21 టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోను ఎవరు ఆఫీస్‌కు రాలేదు. వెస్ట్‌జోనల్‌ కమిషనర్‌ ప్రియాంక అల సమీక్షా సమావేశాన్ని చందానగర్‌ సర్కిల్‌లో నిర్వహించడం గమనార్హం. అటు మూసారాంబాగ్‌లోని నివాసంలో మరో డీఎస్పీ ఫయాజ్‌ సయ్యద్‌ నేతృత్వంలో అధికారుల బృందం సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు శేరిలింగంపల్లి సర్కిల్‌ టీపీవో ఎం.నర్సింహ రాములు చాంబర్‌ను ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. గురువారం ఉదయం బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి టీపీవో చాంబర్‌ ఎక్కడ అని అడిగి తెలుసుకున్నాడు. అప్పటికే తెరిచి ఉన్న చాంబర్‌ను డోర్‌ లాక్‌ వేసి సీజ్‌ చేశారు. చాంబర్‌లో ముఖ్యమైన ఫైళ్లు ఉన్నాయని, ఎవరు తెరవరాదని సెక్యూరిటీతో చెప్పి వెళ్లారు. లాక్‌పై వేసిన సీల్‌పై సీబీ డీఎస్‌పీ డాక్టర్‌ శ్రీనివాస్‌ పేరుతో పాటు ఫోన్‌ నెంబర్‌ రాసి వెళ్లారు. కాగా సిటీ ప్లానర్‌ నర్సింహ రాములు షిరిడీ యాత్రలో ఉన్నట్లు సమాచారం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page