Home హాట్ న్యూస్ పెర్కిట్ చౌరస్తా వద్ద కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన బిజెపి కార్యకర్తలు.
హాట్ న్యూస్

పెర్కిట్ చౌరస్తా వద్ద కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన బిజెపి కార్యకర్తలు.

ఆర్మూర్ (తెలంగాణ వార్త) టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ హన్మకొండలోని టిఆర్ఎస్ సమావేశంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడమైనది.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ లు మాట్లాడుతు…
ప్రపంచమే ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి, ప్రపంచ నేతగా కొనియాడబడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై కేటీఆర్ మాట్లాడిన భాష,యాస సరైంది కాదని.
మోడీ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశం కోసం ధర్మం కోసం నిరంతరం పాటుపడుతూ దేశాభివృద్ధే ధ్యేయంగా, విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతున్నారని. ఎవరి వల్లనో మోడీ గారికి పదవులు రాలేవని, స్వయంకృషితో తనకు ప్రధానమంత్రి పదవిని దేశ ప్రజలే అప్పగించడమైందని.
కానీ కేటీఆర్ నీకు నీ తండ్రి కెసిఆర్ లేకుంటే ఈ రోజు నీ పరిస్థితి ఏందో తెలుసుకొని మాట్లాడాలని, తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కారణంగా రాలేదని. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణ త్యాగాలు చేయడమైనదని, సబ్బన్న వర్గాలు, ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ కోసం ఉద్యమిస్తే తెలంగాణ వచ్చిందని. కానీ ఒక్క రోజు నిరాహార దీక్ష చేయగానే తెలంగాణ రాలేదని‌.కేటిఆర్ నువ్వు నీ తండ్రి కెసిఆర్ పూటకో ఓ మాట మాట్లాడుతూ తెలంగాణ కోసం అమరులైనటువంటి వ్యక్తులను, వారి కుటుంబాలను మీరు ఇచ్చిన సహకారం ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని.తెలంగాణ కోసం ఉద్యమించి సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తులను పక్కకుపెట్టి తెలంగాణ ద్రోహులను, ఇతర పార్టీల్లో గెలిచిన వారిని టిఆర్ఎస్ లో చేర్చుకొని రాష్ట్ర మంత్రులుగా చేసినటువంటి మీరు బుద్ధి లేకుండా, సంస్కార హీనంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పై అనుచితంగా మాట్లాడే అర్హత మీకు లేదని. మీరు నిజంగా మగ పుట్టుక పుట్టి ఉంటే ముందు పాతబస్తీలో కరెంటు బకాయిలను వసూలు చేయాలని. పాతబస్తీలో కరెంటు బకాయిలు వసూలు చేసే దమ్ముందా అని బిజెపి ప్రశ్నిస్తా ఉంది. కరెంటు బిల్లులు కట్టమని అడిగిన అధికారుల పైన చేయి వేసుకున్నా కూడా మాట్లాడని మీరు బెంగుళూరులోని హిజాబ్ సంఘటనపై మాట్లాడుతారు.కాని హనుమాన్ జయంతి నాడు, శ్రీరామనవమి నాడు హిందువులు శోభాయాత్రలు తీస్తే వాటిపై మతోన్మాద మూకలు రాళ్లతో దాడులు చేసినా మాట్లాడని మీరు మతోన్మాదులు అక్రమంగా నిర్మించుకున్నటువంటి అక్రమ కట్టడాలు కూల్చివేత గురించి మాట్లాడతారా?. అసలు మీకు సిగ్గు ఉందా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి, ఆత్మబలిదానాలు చేసినటువంటి వ్యక్తులు ఇలాంటి వారి కోసమా మేము ఆత్మబలిదానాలు చేసింది అని వారి ఆత్మలు సైతం గోసతో బాధపడుతున్నాయని. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని గౌరవ ప్రధాన మంత్రి గారి పై మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడమైనది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడాన్ని జీర్ణించుకోలేని కేసీఆర్, కేటీఆర్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని.

ఈ రాష్ట్ర ప్రజలు ప్రతీ విషయాన్ని గమనిస్తున్నారని భారతీయ జనతా పార్టీ పై, భారత ప్రధాని పై “అవాకులు-చవాకులు” మాట్లాడడం మానుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని లేనట్లయితే రాబోయే కాలంలో ప్రజలే టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడంఖాయమని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది.

ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు భూపేంధర్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పరుశురాం గౌడ్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు పసుపుల సాయికుమార్, ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షులు పెరంబదూర్ వాసు, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్సింగ్, ఉపాధ్యక్షులు గుగులోత్ తిరుపతి నాయక్, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ కార్యదర్శులు శేషగిరి లింగం,తెడ్డు రవికుమార్, సాయి తేజ, అరవింద్, శివక్రాంతి బిజెపి మరియు వివిధ మోర్చా ల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page