తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాల యాజమాన్యం క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ పిల్లలకు కృష్ణాష్టమి సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషపరంగా ఉందని తెలియజేశారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు కలరంగంలో కూడా ముందంజలో ఉండాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Leave a comment