- స్వరాష్టం ఏర్పడి 8 ఏండ్లు దాటినా ఇప్పటి వరకు అనేక మందికి కనీసం ఇండ్లు లేవు , కరెంటు లేదు*
- రానున్న రోజుల్లో రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది*
- YSR తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్*
ఆర్ముర్, తెలంగాణ వార్త: నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ నియోజకవర్గ కేంద్రంలో YSR తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు పార్టీ నేతలతో కలసి పర్యటించారు.
ఆర్ముర్ పట్టణంలోని వివిధ కాలనీలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా పార్టీ నేతలకు సంప్రదించాలని , ప్రజల పక్షాన YSR తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
YSR గారు పేద ప్రజల కోసం పెన్షన్లు , ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని , రైతలకు ఉచిత కరెంటు , విద్యార్థులకు ఫీజు రియంబర్సుమెంట్ , జలయజ్ఞం వంటి గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను అదుకున్నారన్నారు.
మళ్ళీ ప్రజలంతా రాజన్న బిడ్డను ఆశీర్వదించి , రాజన్న పాలన తేవాలన్నారు .
ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్ టీ విభాగం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ , బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కిషన్ , సీనియర్ నాయకులు దినేష్ , మోనిత , రాధ తదితరులు పాల్గొన్నారు
Leave a comment