Home హాట్ న్యూస్ బిజెపి కాండవ కప్పుకున్న ది గ్రేట్ కాళీ.
హాట్ న్యూస్

బిజెపి కాండవ కప్పుకున్న ది గ్రేట్ కాళీ.

పంజాబ్ (తెలంగాణ వార్త)
బిజెపి కాండవ కప్పుకున్న ది గ్రేట్ కాలి.

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్‌ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్‌ దలీప్‌ సింగ్‌ రాణా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నాడు. ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు. త్వరలో జరగనున్న పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో ఖలీ బీజేపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారవచ్చని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన ఖలీ.. పోలీస్‌ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా పంజాబ్‌కు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు. అక్కడ ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ప్రోద్భలం మేరకు రెజ్లర్‌గా మారిన అతను వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ)లో ఉన్నత శిఖరాలకు చేరాడు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ హోదా నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ఎదిగాడు. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఖలీ, భారత్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ సైన్‌ చేసిన మొట్టమొదటి ప్రొఫెషనల్ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page