Home హాట్ న్యూస్ తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ హైటెక్ దోపిడి…?
హాట్ న్యూస్

తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ హైటెక్ దోపిడి…?

మాస్కులు ధరించని విద్యార్థులు ఉపాధ్యాయులు

విద్యా వ్యవస్థను తుంగలో తొక్కిన తెలంగాణ విద్యాశాఖ అధికారులు

తెలంగాణ వార్త ;08, జూలై ;( హైదరాబాద్) హైదరాబాద్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర లో నిజామాబాద్ , హైదరాబాద్, బోధన్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, కోరుట్ల, వివిధ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటుస్కూల్ హైటెక్ దోపిడి?ప్రైవేటు స్కూల్ కి వెళ్లాలంటే?మా స్కూల్ లో నాణ్యమైన విద్య రండి రండి రండి మా స్కూళ్లకు రారండహో
మా స్కూల్లో ర్యాంకులు మా స్కూల్లో కేరళ టీచర్లు
మాస్కూల్లకుర్యాంకులు,రాజకీయనాయకులతోఫోటోలకు పోజులు .మా స్కూల్ లో ముప్పై సంవత్సరాలుగా ర్యాంకులు .కూటి కోసం కోటి విద్యలు, విద్య కోసం కోట్ల రూపాయలు. సరస్వతి అంగట్లోసరుకులఅమ్మబడుతుందిరూపాయలతోర్యాంకులుకొంటున్నప్రైవేటుస్కూలప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి డబ్బే పరమావధిగా భావించి అడ్డదారులు తొక్కుతున్నారు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ. నర్సరీ నుండి ఐదవ తరగతి వరకూ దాదాపుగా 20 వేల నుండి లక్ష రూపాయల వరకు అవుతుంది. మరి అడ్మిషన్ కొరకు అయితే 1000 నుండి 2000 వరకు, మరి బుక్స్ కు 1000 నుండి పదివేల వరకు, స్కూల్ డ్రెస్ కైతే 500 నుండి 1000 రూపాయల వరకు, స్కూల్ బస్సు నెలకు మూడు వేల నుండి పదివేల వరకు, రెసిడెన్షియల్ అయితే 50 వేల నుండి రెండు లక్షలు అంటూ రోజుకో కొత్త స్కూలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.ఎలాంటి వసతులు ఆటస్థలం లేకున్నా స్కూల్ లు నడుస్తున్నాయి.. రోడ్ల కు దగ్గరగా ఉండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. స్కూళ్లలో సరైన వసతులు లేకపోయినా ప్రైవేట్ స్కూల్లో చదివితే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని కల్లబొల్లి మాటలతో ఎర వేస్తున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు బస్సులో అయితే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించి బస్సు ప్రమాదాలకు గురి అయినప్పుడు మాత్రమే పత్రికల్లో టీవీ చానళ్ళలో వచ్చినప్పుడు అందరూ అధికారుల నుండి రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాలు ధర్నా లు బందులు అంటూ ప్రైవేట్ స్కూల్ల చుట్టూ తిరుగుతారు. ఇది జరగడానికి కారణం మాత్రం బయటకు రాదు. వచ్చినా స్కూల్ సీజ్ అంటారు, వారం రోజుల తర్వాత మళ్లీ స్కూలు ఓపెన్ అవుతుంది ఎందుకంటే అదే ప్రైవేట్ స్కూల్లో ఉన్న ప్రత్యేకత.! ఎలాంటి చెకింగ్ లు ఉండవు పర్మిషన్ లు ఉండవు ఇవి చాలవు అన్నట్టుగా నవోదయ గురుకుల కోచింగ్ లు అంటూ మీ పిల్లలకు ఆరు నెలల్లో ఫ్రీ సీట్ అంటూ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. *నిద్రావస్థలో అధికారులు…?
అడ్డగోలు విద్యా వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన అధికారులే నిద్రావస్థలో ఉన్నారు. అక్రమార్కులు అందించే చేతివాటాన్ని జేబులో వేసుకుని కొత్త విజన్ సృష్టిస్తున్నారు. వారు చేసే తప్పుడు విధానాలను సమర్థిస్తూ కనీసం ఆ విద్యా వ్యవస్థ వైపు కన్నెత్తి చూడటం లేదు. గతంలో విద్యాశాఖ అధికారులు నేరుగా వెళ్లి తనిఖీ చేపట్టే వారు. ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ విద్య సంస్థలకు నోటీసులు జారీ చేయడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తే ఆ విద్యాసంస్థను సీజ్ చేసేవారు. ఆ నిబంధనలను పాటించకపోతే ఆ విద్యాసంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి పై అధికారులకు నివేదికలు సమర్పించేవారు. కనీసం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించడం లేదని తెలిసినా కూడా ఆ సంస్థ యాజమాన్యాలు చెల్లించే ముడుపులు తీసుకుని గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. గల్లీకో విద్యాసంస్థ అదే పేరుతో బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని కనీసం ఉపాధ్యాయులకు పట్టుమని నెలకు ఐదు వేలు జీతాలు ఇవ్వకుండా, అర్హతలేని, అవగాహన లేని, ఇంటర్, డిగ్రీచదువుకున్నవారిని ఉపాధ్యాయులుగా ఎంచుకొని అక్రమఅర్జనకుపాల్పడుతున్నారు. కాంట్రాక్టు కింద గా ఎంపిక చేసుకొని వందలాది మంది విద్యార్థులను ఒకే హాల్ లో వుంచి విద్యాబోధన చేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వారు ఇచ్చే లంచాలకు ఎగబడుతూ స్కూల్ లకు సంబంధించిన నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యార్థి మాత్రం మంచి నీళ్ళతో సహా నోట్ బుక్స్ కు విచ్చలవిడిగా స్కూల్లో ఫీజుల నియంత్రణ లేనే లేదు. డీఈవో డి, ఐ ఈ ఓ, వంటి అధికారులు ఎంఈఓ ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు విద్యా ప్రమాణాలను కాపాడవలసిన అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉంది అనడానికి అధికారులు స్కూల్ యాజమాన్యాలు విద్యాధికారులు విద్యార్థులను నిట్టనిలువునా దోపిడీ చేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. స్కూల్ బస్సులపై తనిఖీలు ఎక్కడ…?
ఫిట్నెస్ కలిగిన బస్సులు మాత్రమే రోడ్లపై తిరగాల్సి ఉంటుంది. కానీ దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన బస్సులు రోడ్లపై తిరుగుతున్న తనిఖీ చేసే అధికారులు లేరు. విద్యార్థులు ఫిట్నెస్లేని బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బస్సులో ఎక్కిన పిల్లవాడు తిరిగి ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతూ ఎదురు చూడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి ఫిట్నెస్లేని వాహనాలను ఫిట్ చేసేవారు. కానీ నేడు మాత్రం తనిఖీలు కనుమరుగైపోయాయి. అడపదడప తనిఖీలు చేసి స్కూల్ బస్సుల యాజమాన్యాలు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి హడావుడి చేసి బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి జిల్లాలలో మెజిస్ట్రేట్ లు మాత్రం ఆ స్కూల్లో ర్యాంకులు వచ్చినప్పుడు ఫోటోలకు ఫోజులు ఇస్తూ నియమ నిబంధనలను పట్టీపట్టనట్లు గా మా జిల్లా విద్యాసంస్థల్లో ఇన్ని ర్యాంకులు అంటూ డబ్బాలు కొట్టుకుంటూ జిల్లాల వారీగా మెజిస్ట్రేట్ చేస్తున్న పనులు విద్యావ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అధికారులే వారి కిందిస్థాయి అధికారులకు విద్యాసంస్థల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. జిల్లాలో అధికారులు బాగుంటే నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రైవేట్ శక్తులను అనగదొక్కవచ్చు. లక్షలలో కాకుండగా వేల ఫీజులతో నే విద్యను మధ్యతరగతి దిగువ మధ్య తరగతి విద్యార్థులకు మంచి విద్యను అందించడం మీ బాధ్యత..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page