హైదరాబాద్ అక్టోబర్ 3;- తెలంగాణ వార్త
పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే, మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని పియుసి ఛైర్మన్&ఆర్మూర్ ఎమ్మెల్యే,నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆడపడుచులు అందరికీ, ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లా,ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు ఎమ్మెల్యే సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఒక్కరూ పండగని ఆనందోత్సాహాల మధ్య తగు జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు.రూ.339.73 కోట్లతో కోటికి పైగా మహిళలకు వివిధ డిజైన్లలో చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి ఓ తండ్రిలా, పెద్దన్నలా సీఎం కెసిఆర్ చీరలు, సారెలతో పండుగలను గొప్పగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. మహిళలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Leave a comment