నందిపేట్ ,తెలంగాణ వార్త: నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు ఎంపీటీసీ రాజు ఆదివారం హైదరాబాద్ వెళ్తుండగా దగ్గి హై వే పై రన్నింగ్ లో ముందటి టైర్ పగిలిపోయింది. ఎం పి టి సి రాజు స్వయంగా వాహనం నడపడం తో అప్రమత్తమై వెంటనే చాక చక్యంగా కారు ను కంట్రోల్ చేసి ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. కార్ టైర్ మార్చుతుండగా దారిన వెళ్లేవారు 1033 కి ఫోన్ చేయగా ఐదు నిమిషాల వ్యవధిలో నేషనల్ హైవే అథారిటీ యొక్క సహాయ వాహనం సిబ్బంది రవి అతని సహచరులు వచ్చి కారును రిపేర్ చేసి పంపించేశారు. ఇంత తొందరగా హైవే సిబ్బంది వచ్చి సహాయం చేయడంతో ఎంపిటిసి రాజు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వాహనంలో మండల్ ముస్లిం కమిటీ ఫౌండర్ షేక్ గౌస్, జామే మసీద్ మాజీ అధ్యక్షులు సయ్యద్ జమీల్ తదితరులు ఉన్నారు
Leave a comment